Collector Warning: ఈ పరీక్షలపై.. తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు
Sakshi Education
టెన్త్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. వివిధ కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తుంది ప్రభుత్వం. అయితే, ఒక పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ ఇలా హెచ్చరించారు..
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాజర్షి షా తనిఖీ చేశారు. పదో తరగతిలో మాస్‌కాపీయింగ్ జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ఇస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Hostel Inspection: హాస్టల్ విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలి..
ఉట్నూర్‌లో పేపర్ లీకైనట్లు వైరల్ కాగా, ఎంఈవోతో విచారణ చేపట్టామని తెలిపారు. చివరకు ఇది ఫేక్ అని తేలిందని పేర్కొన్నారు. ఎస్పీ గౌస్ ఆలం మాట్లాడుతూ.. తప్పుడు ప్రచారం చేసిన నలుగురిపై ఇప్పటికే కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.
Published date : 22 Mar 2024 03:08PM
Tags
- Tenth Class Exams
- ts public exams
- fake news on social media
- collector warning
- exam center inspection
- students education
- Education News
- Sakshi Education News
- Adilabad news
- Social media warning
- Adilabad Town
- 10th class examination center inspection
- Masscopy allegation
- Government Girls High School
- SakshiEducationUpdates