Skip to main content

Jobs with Study: ప్రభుత్వ కళాశాలలో కేరీర్‌ ప్లానింగ్‌పై కార్యశాల

ఎస్సారార్‌ ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో నిర్వహించిన కార్యశాలలో మాట్లాడారు కేంద్రీయ విశ్వ విద్యాలయం సీనియర్‌ ప్రొఫెసర్‌. ఈ సందర్భంగా యువతకు ఉద్యోగావకాశాల గురించి సూచనలిచ్చారు..
Workshop on Career Planning at Government Arts and Science College  Senior Professor speaks at workshop in Karimnagar City, advising youth on job opportunities.

కరీంనగర్‌సిటీ: యువత నిరంతర అధ్యయనంతో ఉద్యోగాలు సాధించవచ్చని హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వ విద్యాలయం సీనియర్‌ ప్రొఫెసర్‌ బి.రాజశేఖర్‌ అన్నారు. గురువారం ఎస్సారార్‌ ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో అంతర్గత నైపుణ్యాల సాధన విభాగం (ఐక్యూఏసీ) ఆధ్వర్యంలో కేరీర్‌ ప్లానింగ్‌పై నిర్వహించిన కార్యశాలలో మాట్లాడారు. నిరంతర కృషి, సూక్ష్మ పరిశీలన, అధ్యయనశీలత, క్రమశిక్షణ, వార్త పత్రికల విశ్లేషణ, మేధోమదనం, బృంద చర్చలు, ప్రణాళిక, లక్ష్యంతో కూడిన లోతైన విషయాల అవగాహనతోనే ఉద్యోగ సాధన సాఫల్యమవుతుందని అన్నారు.

Prime Minister's Awards for Excellence: ఏపీకి ప్రైమ్‌ మినిస్టర్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు

చదువు కేవలం డిగ్రీల కోసం కాకుండా ప్రతిభ, విషయ సాధికారత, సామర్థ్యాల పెంపుదల దిశగా జరగాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ కలువకుంట రామకృష్ణ మాట్లాడుతూ ఎస్సారార్‌ కళాశాల నైపుణ్య వికాస కేంద్రంగా పని చేస్తుందన్నారు. ఐక్యూఏసీ సమన్వయకర్త రాజేందర్‌, ఐక్యూఏసీ నివేదిక సమర్పించగా వైస్‌ ప్రిన్సిపాల్‌ రాజయ్య, సురేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌, మల్లారెడ్డి, అర్చన, వరప్రసాద్‌, శారద, గోపాల్‌కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

TS TET 2024: టెట్‌.. టఫ్‌.. రెగ్యులర్‌ బీఎడ్, డీఎడ్‌ వారితో రాసేందుకు టీచర్ల ససేమిరా

Published date : 22 Mar 2024 12:45PM

Photo Stories