Paper Leakage: ఎస్సెస్సీ ఉర్దూ పేపర్ లీకేజ్‌పై క్లారిటీ..
ఉట్నూర్ రూరల్: ఈ నెల 19వ తేదీన ఉట్నూర్‌లో ఎస్సెస్సీ ఉర్దూ పేపర్ లీకేజీ వ్యవహారంపై విచారణ చేపట్టాలన్న ఎస్సీ గౌస్ ఆలం ఆదేశాల మేరకు బుధవారం ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ విచారణ చేపట్టారు. ఉట్నూర్ టీఎంఆర్‌ఎస్ ప్రిన్సిపాల్ వెంకట ప్రసాద్‌పై కక్ష్యసాధింపు దిశగా ఈ కాపీయింగ్ పన్నాగం పన్నినట్లు నిర్ధారించారు. విచారణలో డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మహ్మద్ ముబాషిర్ గతంలో ఉట్నూర్ మైనార్టీ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేశాడు.
Intermediate Public Exams 2024: ఇంటర్ మూల్యాంకన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని
అతడి తీరు సరిగా లేక ఇచ్చోడకు బదిలీ చేశారు. కానీ, ముబాషిర్ ఈ ఉద్యోగం మానేసి ఏకలవ్య స్కూల్‌లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా చేరాడు. కానీ, తనను బదిలీ చేసిన టీఎంఆర్‌ఎస్ ఉట్నూర్ ప్రిన్సిపాల్ వెంకటప్రసాద్‌పై కోపం పెంచుకుని ఎలాగైనా అతడిని బద్నాం చేయాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 19న ముబాషిర్ మరో వ్యక్తి ఆసిఫ్‌తో కలిసి ఓ ప్లాన్ వేశాడు. ఉట్నూర్‌లో పనిచేసే ఉపాధ్యాయుడు అబ్దుల్ సమీ ఇంటికి సయ్యద్ కైఫ్ అనే వ్యక్తిని పంపించి అతడి వీడియోలు, ఫొటోలు తీసి పంపించమని చెప్పాడు.
Collector Warning: ఈ పరీక్షలపై.. తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు
సయ్యద్ కైఫ్ మరో వ్యక్తి షాదాబ్‌తో వెళ్లి సమీ గ్రామర్ నోట్స్ తెల్ల కాగితంపై రాసుకుంటుండగా వీడియో, ఫొటోలు తీసి వాటిని వాట్సప్ ద్వారా ముబాషిర్‌కు పంపించాడు. తర్వాత ముబాషిర్ ఉపాధ్యాయుడు సమీకి ఫోన్ చేసి.. మాల్‌ప్రాక్టిస్ జరుగుతుందా? అని అడిగాడు. దీనికి అసహనంతో సమీ అవునన్నట్లుగా బదులిచ్చాడు. దీనిని ముబాషిర్ వాయిస్ రికార్డ్ చేశాడు. ఆ తర్వాత వాయిస్ రికార్డుతోపాటు కైఫ్ తీసిన వీడియోలు వాట్సప్ ద్వారా కాగజ్‌నగర్‌లోని మహ్మద్ ఆసిఫ్‌కు పంపించాడు.
ఆసిఫ్ కూడా ప్రిన్సిపాల్ వెంకటప్రసాద్ కారణంగా ఉద్యోగం కోల్పోయాడు. దీంతో వీరిద్దరూ ప్రిన్సిపాల్ వెంకటప్రసాద్‌పై కోపంతో కైఫ్ సాయం తీసుకుని ఎస్సెస్సీ ఉర్దూ పేపర్ లీకేజీ డ్రామాకు తెరలేపారు. ఎస్సెస్సీ ఉర్దూ పేపర్ లీకేజీ అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు. దీనిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన అధికారులు, పోలీసులు పేపర్ లీక్ కాలేదని నిర్ధారించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసు నమోదు చేశారు.
Hostel Inspection: హాస్టల్ విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలి..