Intermediate Public Exams 2024: ఇంటర్ మూల్యాంకన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని .....
అమలాపురం : అసిస్టెంట్ ఎగ్జామినర్లు వెంటనే విధులకు హాజరై మూల్యాంకన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఇంటర్ క్యాంపు, డీఐఈవో వనుము సోమశేఖరరావు పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ పరీక్షా పత్రాల మూల్యాంకన ప్రక్రియ మొదలైంది. అయితే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ నియమించిన కొంతమంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు ఇంకా హాజరుకాకపోవడం వల్ల మూల్యాంకన ప్రక్రియ జాప్యం జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆయ కళాశాలల ప్రిన్సిపాల్స్ కూడా అసిస్టెంట్ ఎగ్జామినర్లుగా నియమితులైన అధ్యాపకులను రిలీవ్ చేసి విధులకు పంపించాలని సోమశేఖరరావు గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఈ నెల 22వ తేదీ నుంచి ఎకనామిక్స్, ఫిజిక్స్ పరీక్షా పత్రాల మూల్యాంకనం మొదలు కానుందని తెలిపారు. ఇప్పటికే మొదలైన గణితం, తెలుగు, ఇంగ్లిషు, పౌర శాస్త్రం పరీక్షా పత్రాల మూల్యాంకనానికి నియమితులైన కొంతమంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు ఇంకా విధులకు హాజరు కాలేదని పేర్కొన్నారు.
Tags
- Intermediate Annual exams2024
- AP Intermediate evaluation 2024
- AP Intermediate evaluation
- AP Intermediate 2024 News
- AP Intermediate exams News
- sakshieducation latest news
- EvaluationProcess
- IntermediateExaminationPapers
- LocalGovernmentGirlsJuniorCollege
- Inter
- AssistantExaminers
- AmalapuramTown
- SakshiEducationUpdates