pharmacy: ఫార్మసీ రంగంలో అగ్రస్థానానికి భారత్
Sakshi Education
రాయనిగూడెం: రానున్న రోజుల్లో భారతదేశం ఫార్మారంగ ఎగుమతుల్లో అగ్రస్థానానికి చేరుకుంటుందని పాలమూరు యూనివర్సిటీ ఫార్మసీ డిపార్ట్‌మెంట్ హెడ్ ప్రొఫెసర్ వి ప్రభాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాయనిగూడెంలోని వికాస్ కాలేజీ ఆఫ్ ఫార్మాసూటికల్ సైన్సెస్ కళాశాల వార్షికోత్సవాలు శనివారం(ఫిబ్రవరి 25) అట్టహాసంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియా కార్యక్రమాల ద్వారా ఫార్మసీ రంగం గణనీయాభివ`ద్ధి చెందుతోందన్నారు. కరోనా కాలంలో ప్రపంచానికి జౌషధాలను ఎగుమతి చేసే స్థాయికి భారత్ చేరుకుందన్నారు. సొంతంగా కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేసిన ఘనత ఇండియాకు దక్కిందన్నారు. అలాగే కాలేజీ స్థాపించిన ఈ 18 ఏళ్లలో ఇక్కడ చదువుకున్న వేలాది మంది విద్యార్థులు, దేశీయంగా అలాగే విదేశాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ రఘుదాస్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
చదవండి: ఒకే మెయిల్‌తో రూ.90 లక్షలు రాబట్టిన చాట్ జీపీటీ...
చదవండి: కార్డియాక్ అరెస్ట్‌కు గురైతే ఎలా స్పందించాలో తెలుసా...
Published date : 27 Feb 2023 06:56PM