IIT Jodhpur: వ్యాధులను గుర్తించే సరికొత్త సెన్సర్
Sakshi Education
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)–జోధ్‌పూర్ పరిశోధకులు తక్కువ ఖర్చుతో కూడిన హ్యూమన్‌బ్రీత్ సెన్సర్‌ను అభివృద్ధి చేశారు. ఇది డ్రంక్ అంyŠ æడ్రైవింగ్ కేసుల్లో ఆల్కహాల్ కంటెంట్‌ను కొలవటమేగాక, పలు రకాల వ్యాధులను నిర్ధారించటంలోనూ సహాయపడుతుంది. ‘ఆల్కహాల్ వాసనను పసిగట్టే సెన్సర్లతోబాటు, కొన్ని వ్యాధుల లక్షణాల్ని గుర్తించే సాంకేతికత ఇందులో ఉంది. ఆస్తమా, డయాబెటిక్, ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె సమస్యల్ని పసిగడుతుంది’ అని ఐఐటీ జోధ్‌పూర్ పరిశోధకులు తెలిపారు. అత్యంత తక్కువ ధరలో, వెంటనే ఫలితాల్ని చూపగలిగే హెల్త్ మానిటరింగ్ పరికరం ఇప్పుడు చాలా అవసరమని తెలిపారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 28 Feb 2024 10:37AM