LSAM 20: ఎల్ఎస్ఏఎం బార్జ్‌ను ప్రారంభించిన భారత నౌకాదళం.. 'మేక్ ఇన్ ఇండియా'కు మద్దతు
ఈ బార్జ్‌ను M/s సూర్యదీప్త ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, MSME షిప్‌యార్డ్ నిర్మించింది. ఈ ప్రాజెక్ట్ భారతదేశం యొక్క 'మేక్ ఇన్ ఇండియా' చొరవకు ఒక నిదర్శనం.
ఈ బార్జ్‌లు భారత నౌకాదళం యొక్క కార్యాచరణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతాయి. జెట్టీలు, ఔటర్ హార్బర్‌ల వద్ద నౌకలకు మందుగుండు సామాగ్రితో సహా కీలకమైన సామాగ్రిని రవాణా చేయడం వంటివి సులభతరం చేస్తాయి. బార్జ్‌లు భారతీయ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ యొక్క కఠినమైన ప్రమాణాలకు అనుగుణంగా దేశీయంగా నిర్మించబడ్డాయి.
Indian Navy: భారత నావిక దళం.. మొదటి ఫ్లీట్ సపోర్ట్ షిప్ నిర్మాణం ప్రారంభం
వివరాలు..
➤ LSAM 20 ఒక మందుగుండు సామగ్రి కమ్ టార్పెడో కమ్ మిస్సైల్ బార్జ్.
➤ మొత్తం 11 బార్జ్‌ల నిర్మాణానికి సంబంధించిన ఒప్పందంపై రక్షణ మంత్రిత్వ శాఖ (MoD), M/s సూర్యదీప్త ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య 2021 మార్చి 5న సంతకం చేశాయి.
➤ డిజైన్ దశలో విశాఖపట్నంలోని నావల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లాబొరేటరీలో మోడల్ టెస్టింగ్ జరిగింది.
ఈ బార్జ్‌ల ప్రాముఖ్యత ఇదే..
➤ భారత నౌకాదళం యొక్క కార్యాచరణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతాయి.
➤ జెట్టీలు, ఔటర్ హార్బర్‌ల వద్ద నౌకలకు మందుగుండు సామాగ్రితో సహా కీలకమైన సామాగ్రిని రవాణా చేయడం, దిగడం వంటివి సులభతరం చేస్తాయి.
➤ భారతదేశం యొక్క "మేక్ ఇన్ ఇండియా" చొరవకు మద్దతు ఇస్తాయి.