Skip to main content

February Month Holidays : ఫిబ్ర‌వ‌రిలో సెల‌వులు ఇవే.. రానున్న రోజుల్లో విద్యార్థుల‌కు పండ‌గే..

సెల‌వులంటే ఏ విద్యార్థికి న‌చ్చకుండా ఉంటుంది. ప్ర‌తీ విద్యార్థి, ఉద్యోగి కూడా ఒక్క రోజు సెల‌వు వ‌చ్చినా చాలు అని ఎదురుచూస్తూ ఉంటారు.
February month holidays for schools and employees  february month holidays list announcement

సాక్షి ఎడ్యుకేష‌న్: సెల‌వులంటే ఏ విద్యార్థికి న‌చ్చకుండా ఉంటుంది. ప్ర‌తీ విద్యార్థి, ఉద్యోగి కూడా ఒక్క రోజు సెల‌వు వ‌చ్చినా చాలు అని ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటిది, ఒక‌టి రెండు కాదు, వ‌రుస సెల‌వులు రానున్నాయి. జ‌న‌వ‌రి నెల రేప‌టితో ముగియ‌నుంది. అయితే, ఫిబ్ర‌వ‌రి ప్రారంభంలోనే సెల‌వులు ప్రారంభం కానున్నాయి. అదెలా..? అస‌లు ఫిబ్ర‌వ‌రిలో సెల‌వులేమున్నాయి..? ఈ క‌థ‌నం చ‌దివండి..

ఫిబ్ర‌వ‌రి 3 సెల‌వు..

చ‌దువుల తల్లి స‌ర‌స్వ‌తి దేవి పుట్టిన రోజు వ‌సంత పంచ‌మి లేదా శ్రీ పంచమిగా జ‌రుపుకుంటారు. ఈ పండుగ ఈసారి ఫిబ్ర‌వ‌రి 3వ తేదీన అంటే, సోమ‌వారం ఉంది. ఈ రోజున పుస్తకాలను పూజిస్తే జ్ఞానం లభిస్తుందని నమ్ముతారు జ‌నాలు.

Tenth Students : విద్యార్థుల‌కు సెల‌వుల్లోనూ భోజ‌నం అందించాలి.. స‌ర్కార్ కీల‌క‌ ఆదేశం..

అంతేకాదు, ఆ రోజు చిన్న పిల్ల‌ల‌కు అక్ష‌రాభాస్యం కూడా చేయిస్తారు. అందువల్లే వసంత పంచమికి ఆప్షనల్ హాలిడే ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో, ఈ సెల‌వు ప్ర‌తీ విద్యాసంస్థ‌ల‌కు, ఉద్యోగుల‌కు వ‌ర్తిస్తుంది.

వ‌రుస‌గా మూడు రోజులు..

విద్యార్థుల‌కు, ఉద్యోగుల‌కు వ‌రుస‌గా మూడు రోజులు సెల‌వులు రానున్నాయి. అదేలా అంటే, ఫిబ్ర‌వ‌రి 1వ తేదీన శ‌నివారం.. ఈ రోజులు కొన్ని పాఠ‌శాల‌ల‌కు సెల‌వు ఉంటుంది. కొన్ని విద్యాసంస్థ‌లు శని, ఆదివారాలు సాధారణ సెల‌వును ప్ర‌క‌టిస్తుంది. అలా, తొలి సెల‌వు ఫిబ్ర‌వ‌రి 1వ తేదీన‌, ఫిబ్ర‌వ‌రి 2వ తేదీన ఆదివారం.. ఇక్క‌డ ప్ర‌తీ విద్యాసంస్థ‌ల‌కు, ఉద్యోగుల‌కు సెల‌వు ఉంటుంది. ఇక‌పోతే, ఫిబ్ర‌వ‌రి 3వ తేదీ.. ఈ రోజున వ‌సంత పంచ‌మి కార‌ణంగా ఇక్క‌డ కూడా అనేక పాఠ‌శాల‌లు సెల‌వు ప్ర‌క‌టిస్తుంది. కాగా, ఫిబ్ర‌వ‌రి నెల‌ ప్రారంభమే మూడు రోజుల వ‌రుస సెల‌వుల‌తో ఉండ‌డంతో విద్యార్థులకు, ఉద్యోగులకు పండ‌గే అని చెప్పాలి.

Education News: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ..నేడు స్కూళ్లకు సెలవు... ఎందుకంటే

ఫిబ్ర‌వ‌రి సెల‌వులు ఇవే..

ఫిబ్రవరి 2వ తేదీన - వసంత పంచమి (సరస్వతీ దేవిని పూజిస్తారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో సెలవు ప్రకటించారు)
ఫిబ్రవరి 14వ తేదీన - షబ్‌-ఎ-బరాత్‌ (ఆప్షనల్‌ హాలీడేగా ఉంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ స్కూళ్లకు సెలవు దినంగా ఉంది)
ఫిబ్రవరి 19వ తేదీన - శివాజీ జయంతి (ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని  ఫిబ్రవరి 19 న జరుపుకుంటారు మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఆ రోజు పాఠశాలలకు సెలవుగా ఉండ‌నుంది)

February School Holidays 2025: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఫిబ్రవరిలో విద్యార్థులకు మొత్తం ఎన్నిరోజులు సెలవులంటే..

ఫిబ్రవరి 24వ తేదీన‌ - గురు రవిదాస్‌ జయంతి (ప్రతి సంవత్సరం మాఘమాసం పౌర్ణమి రోజున గురు రవిదాస్ జయంతిని జరుపుకుంటారు. యూపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో సెలవుదినం)
ఫిబ్రవరి 26వ తేదీన - మహా శివరాత్రి (స్కూళ్లు, కాలేజీలకు ఆరోజున సెలవు ఉండనుంది).

ఫిబ్ర‌వ‌రిలో సాధార‌ణ సెల‌వులు..

ఫిబ్ర‌వ‌రి 2వ తేదీన ఆదివారం.
ఫిబ్ర‌వ‌రి 8వ తేదీన రెండో శ‌నివారం.
ఫిబ్ర‌వ‌రి 9, 16, 23వ తేదీలు కూడా ఆదివారం.
అంటే, ఫిబ్ర‌వ‌రిలో 5 సాధారణ సెల‌వులు రానున్నాయి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 30 Jan 2025 02:56PM

Photo Stories