NIT: నిట్ 19వ స్నాతకోత్సవం వివరాలు..
Sakshi Education
తెలంగాణ రాష్ట్రం హనుమకొండ జిల్లా కాజీపేటలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) 19వ స్నాతకోత్సవాన్ని అక్టోబర్ 9న వర్చువల్‌గా నిర్వహించనున్నారు.
ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కోవిడ్–19 నేపథ్యంలో వరుసగా రెండో ఏడాది ఆన్ లైన్ లో స్నాతకోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, గౌరవ అతిథి గా ఇస్రో మాజీ చైర్మన్ కె.కస్తూరిరంగన్ పాల్గొననున్నారు. కాలేజీ నుంచి నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు, రిజి్రస్టార్ గోవర్ధన్ రావులు హాజరవుతారు. ఈ సందర్భంగా 1,737 మంది విద్యార్థులు పట్టాలు అందుకోనున్నారు. ఇన్ స్టిట్యూట్ గోల్డ్ మెడల్ పతకాన్ని మెకానికల్ విభాగానికి చెందిన గణేశ్ అందుకోనున్నారు.
చదవండి:
బాలికలకూ శుభవార్త.. ఈ ఏడాది నుంచి ఈ స్కూళ్లు, కాలేజీలో అడ్మిషన్లు
Published date : 09 Oct 2021 03:54PM