Admissions: బాలికలకూ శుభవార్త.. ఈ ఏడాది నుంచి ఈ స్కూళ్లు, కాలేజీలో అడ్మిషన్లు
కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సైనిక్ స్కూళ్లు, కాలేజీలు, నేషనల్ డిఫెన్స్ అకాడమీల్లో బాలికలకు ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు అక్టోబర్ 7న రక్షణ మంత్రిత్వ శాఖ భారత సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించింది. రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కాలేజీ, ఐదు రాష్ట్రీయ మిలటరీ స్కూల్స్‌లో బాలికల ప్రవేశాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొంది. సైనిక్ స్కూళ్లలో బాలికల ప్రేవేశాలు వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానుండగా, నేషనల్ డిఫెన్స్ అకాడమీల్లో మాత్రం ఈ ఏడాది నుంచే అమల్లోకి రానుంది. కేంద్రం ఇప్పటికే ఈ ప్రక్రియను కూడా ప్రారంభించింది. డిసెంబరు 18న నిర్వహించనున్న ప్రవేశ పరీక్షను బాలికలూ రాసేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని నిర్దేశించింది. ఈ ఏడాది నుంచే ప్రవేశపరీక్షకు బాలికలు హాజరయ్యేలా వారి నుంచి దరఖాస్తులు కోరుతూ రెండు రోజుల్లో సవరించిన నోటిఫికేషన్‌ను ప్రచురించాలని సుప్రీంకోర్టు అక్టోబర్ 7న ఆదేశించింది.
దేశ భద్రతలో మహిళలను మరింత భాగస్వామ్యం చేసేందుకు ఇప్పటికే నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మహిళలకు అవకాశం కల్పించారు.
చదవండి: