Telugu Language: పోలీసు శాఖలో తెలుగుకు మరింత ప్రాధాన్యం: డీజీపీ
Sakshi Education
అధికార భాషగా తెలుగుకు పోలీసు శాఖలో మరింత ప్రాధాన్యమిస్తామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ చెప్పారు.
పోలీసు శాఖలో తెలుగుకు మరింత ప్రాధాన్యం: డీజీపీ
ఇందుకోసం డీఐజీ(కోఆర్డినేషన్)ను నోడల్ అధికారిగా నియమిస్తామన్నారు. అధికార భాష తెలుగును పోలీసు శాఖలో మరింత పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ డీజీపీ సవాంగ్‌ను అక్టోబర్ 7న ఆయన కార్యాలయంలో కలిసి కోరారు. త్వరలో పోలీస్‌స్టేషన్లను సందర్శించి క్షేత్రస్థాయిలో అధికార భాషగా తెలుగు అమలవుతున్న తీరును పరిశీలిస్తామన్నారు. దీనిపై డీజీపీ గౌతం సవాంగ్ సానుకూలంగా స్పందించారు.