Skip to main content

Woman IAS Success Story: దృఢ సంకల్పంతో యువ‌తి విజ‌యం

తొలి ప్ర‌య‌త్నంలో క‌లను ర్యాంకు వ‌ల‌న సాధించ‌లేక‌పోయింది ఈ యువ‌తి. కాని, త‌న సంక‌ల్పం, కృషి ప‌ట్టుద‌ల వ‌ద‌ల‌కుండా ఆమె మ‌రోసారి ప్ర‌య‌త్నించ‌గా విజ‌యం పొందింది.. ఎప్పుడు ఐఏఎస్ అనురాధ పాల్ గా గుర్తింపు సాధించింది. ఆమె గ‌మ్య ప్ర‌యాణం గురించి తెలుసుకుందాం..
IAS Anuradha Paul with her parents, Success After Persistence, Determination and Hard Work
IAS Anuradha Paul with her parents

ఐఏఎస్ అనురాధ పాల్ స్వస్థలం.. ఉత్తరాఖండ్.. హరిద్వార్ జిల్లాలోని ఒక చిన్న గ్రామం. ఆమె తండ్రి పాలు అమ్ముతూ కుటుంబాన్ని పోషించేవాడు. పేద కుటుంబం కావడంతో అనురాధ చదువుతో పాటు ఉద్యోగం చేసింది. కోచింగ్ ఫీజు కట్టేందుకు పిల్లలకు ట్యూషన్ చెప్పేది.

TS Constable Cut off Marks 2023 : టీఎస్ కానిస్టేబుల్ కటాఫ్ మార్కులు ఇవే.. కొంపముంచిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు..

అనురాధ పాల్... హరిద్వార్‌లోని నవోదయ విద్యాలయంలో పాఠశాల తర్వాత గోవింద్ బల్లభ్ పంత్ విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో ఇంజనీరింగ్ చేశారు.

UPSC ranker


2008లో ఇంజనీరింగ్ పూర్తి చేసి టెక్ మహీంద్రా కంపెనీలో సెలెక్ట్ అయ్యారు.

UPSC Civils Ranker Success Story : నేను చిన్న వ‌య‌స్సులో.. తొలి ప్ర‌యత్నంలోనే సివిల్స్‌ కొట్టానిలా.. నా స‌క్సెస్ సీక్రెట్ ఇదే..

ఐఏఎస్ కావాలన్నది అనురాధకు ఏకైక లక్ష్యం. అందుకే టెక్ మహీంద్రా ఉద్యోగాన్ని వదిలేశారు. ఆ తర్వాత ఆమె, 3 సంవత్సరాలు.. రూర్కీలోని కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో లెక్చరర్‌గా బోధించారు. 2012లో యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. కానీ ర్యాంక్ 451 వచ్చింది. అందువల్ల ఆమె ఐఏఎస్ కాలేకపోయింది.

Success Story: ఎస్ఐ ఉద్యోగానికి ఎంపిక

అనురాధ పాల్ UPSC ప్రిపరేషన్‌ను వదులుకోలేదు. చివరకు 2015లో 62వ ర్యాంక్‌తో ఆల్ ఇండియా ఉత్తీర్ణత సాధించారు. ఈ విధంగా ఐఏఎస్ కావాలనే తన కల నెరవేరింది. దృఢ సంకల్పం, కృషితో సవాళ్లను అధిగమించవచ్చని ఆమె నిరూపించారు. యువతకు ప్రేరణగా నిలిచారు.

Published date : 09 Oct 2023 11:43AM

Photo Stories