UPSC Civils Ranker Success Story : నేను చిన్న వయస్సులో.. తొలి ప్రయత్నంలోనే సివిల్స్ కొట్టానిలా.. నా సక్సెస్ సీక్రెట్ ఇదే..
కానీ ఈ 23 ఏళ్ల యువతి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి.. తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీలో ఆల్ ఇండియా 102 ర్యాంక్ సాధించింది. ఈమే నవ్య. ఈ నేపథ్యంలో నవ్య సక్సెస్ స్టోరీ మీకోసం..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షకు ప్రతి సంవత్సరం లక్షల మంది హాజరవుతారు. IAS, IPS, IFS లాంటి ఉద్యోగాలకు పోటీ తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. లక్షల్లో ఈ ఉద్యోగాలను అతి కొద్ది మంది మాత్రమే విజయం సాధించగలుగుతారు. యూపీఎస్సీ(UPSC)ని క్లియర్ చేయడానికి, మీకు సరైన వ్యూహం అవసరం.
ఎడ్యుకేషన్..
చండీగఢ్‌కు చెందిన నవ్య ప్రాథమిక విద్య కూడా ఇక్కడే సాగింది. 12వ తరగతి తర్వాత, ఢిల్లీ యూనివర్సిటీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి ఎకనామిక్స్(ఆనర్స్)లో డిగ్రీ చేసింది.
ఒక వైపు మాస్టర్స్.. మరో వైపు యూపీఎస్సీ..
నవ్య తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వెంటనే.., ఒక వైపు ఎకనామిక్స్‌లో మాస్టర్స్‌కు అడ్మిషన్ తీసుకొని.., మరోవైపు UPSC కోసం ప్రిపేర్ కావడం కూడా ప్రారంభించింది. తొలిదశ ప్రిపరేషన్‌లో వార్తాపత్రికలు చదవడం అలవాటు చేసుకున్నారు. వర్తమాన వ్యవహారాలకు సిద్ధం కావడానికి ఇది చాలా ముఖ్యమైన దశ అని ఆమె చెప్పింది. ఏది జరిగినా రోజూ వార్తాపత్రిక చదవండి. అలాగే కరెంట్ అఫైర్స్ నోట్స్ చేస్తూ ఉండండి అని తెలిపింది.
ఈమె UPSC ప్రిపరేషన్ ప్రారంభించే ముందు.., మొదటి ప్రయత్నంలోనే పరీక్ష పాస్ అవ్వాలని నిర్ణయించుకుంది. యూపీఎస్సీలో తొలి ప్రయత్నంలోనే ర్యాంకు సాధించే విధంగా వ్యూహరచన చేసింది. అప్పటికి నవ్య వయసు 23 ఏళ్లు మాత్రమే.
ప్రిపరేషన్ ఇలా..
రాత్రి పడుకునే ముందు.. ఉదయం చదివిన అంశాలను ఓసారి రివిజన్ చేసుకోవాలని నవ్య సలహా ఇస్తోంది. అలాగే పుస్తకాల సంఖ్యను పరిమితంగా ఉంచుకొని.. వాటిని తరచూ చదువుతూ ఉండాలని ఆమె తెలిపింది. ముఖ్యంగా ప్రిలిమ్స్‌కు పుస్తకాల సంఖ్య పరిమితంగా ఉండాలని ఆయన అభిప్రాయపడింది. సివిల్స్ ప్రిలిమ్స్‌ను క్లియర్ చేయడానికి ఇదే ఫార్ములా అని తెలిపింది. ప్రిపరేషన్ కొద్దిగా పెరిగిన తర్వాత పాత సివిల్స్ పరీక్షా పేపర్లను సొంతంగా రాసుకుంటూ... వాటిలో వచ్చే తప్పులను సరిదిద్దుకోవాలని ఆమె తెలిపింది.
సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే.. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలని నవ్య చెప్పింది. మెయిన్స్‌లో జవాబు రాయడానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. షెడ్యూల్‌ను రూపొందించుకుని చదువుకోవాలని నవ్య సలహా ఇస్తోంది. వారంలో ఏం చదవాలో, నెలలో ఏం పూర్తి చేయాలనేది నిర్ణయించుకోవాలని ఆమె చెప్పింది. మీరు ఏ సమయంలో సిద్ధమైనా పూర్తి ఏకాగ్రతతో చెయ్యాలని సూచించింది. ఈ యూపీఎస్సీ సివిల్స్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థులకు ఎంతో కొంత ఉపయుక్తంగా ఉంటాయి.
Tags
- navya singla ifs
- navya singla ifs success story
- navya singla ifs education
- Success Story
- Competitive Exams Success Stories
- Inspire
- motivational story in telugu
- Civil Services Success Stories
- civils success stories
- Sakshi Education Success Stories
- civils study materials
- civil sevices
- preparation tips
- UPSC exams 2023
- Civil Services Success Stories