Skip to main content

Government Posts Age Limit : గ‌రిష్ట‌ వ‌యోప‌రిమితి భారీగా పెంపు.. ఈ పోస్టుల‌కు వ‌ర్తించ‌దు..

సాక్షి, ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లోని ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీకి గ‌రిష్ట‌ వ‌యోప‌రిమితిని 34 నుంచి 44 ఏళ్ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం పొడిగించింది.
Government Posts Age Limit 2022
TS Government Posts Age Limit 2022

రెండేళ్ల పాటు ఈ స‌డ‌లింపు అమ‌లులో ఉంటుంద‌ని ప్ర‌భుత్వం తెలిపింది. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేష్ కుమార్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. పోలీసు, అబ్కారీ,అగ్రిమాప‌క‌, అట‌వీ, జైళ్ల శాఖ వంటి యూనిఫాం స‌ర్వీసు పోస్టుల‌కు ఈ వ‌యోప‌రిమితి వ‌ర్తించ‌ద‌ని ఈ ఉత్త‌ర్వులలో స్ఫ‌ష్టంగా పేర్కొన్నారు. త్వ‌ర‌లోనే తెలంగాణలో భారీ ఎత్తున ఉద్యోగాల నోటిఫికేష‌న్ జారీచేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

వయోపరిమితి ఇలా..
☛ ఓసీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లు
☛ ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల వయోపరిమితి 49 ఏళ్లు
☛ దివ్యాంగ అభ్యర్థుల వయోపరిమితి 54 ఏళ్లు
☛ ఎక్స్‌ సర్వీస్‌మెన్లకు వయోపరిమితి 47 ఏళ్లు
☛ హోంశాఖలో వయోపరిమితి మినహాయింపు లేదు

తెలంగాణ పోలీసు ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

పోటీ ప‌రీక్ష‌ల బిట్‌బ్యాంక్ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

Groups: గ్రూప్‌–1&2లో ఉద్యోగం సాధించ‌డం ఎలా ?

Telangana: భారీగా ప్ర‌భుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు.. ఇక్క‌డి నుంచి చదవాల్సిందే..

గ్రూప్స్‌ ప‌రీక్ష‌ల్లో నెగ్గాలంటే..ఇవి త‌ప్ప‌క చ‌ద‌వాల్సిందే..

Published date : 28 Mar 2022 03:59PM

Photo Stories