Telangana Government Jobs: పట్టు పట్టండి.. కొలువు కొట్టండి.. ఇక మీదే ఆలస్యం..
ఈ మెట్టు ఎక్కడానికి ప్రణాళిక అవసరం. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం తెలంగాణ ప్రభుత్వం గ్రూప్–1,2,3,4, ప్రభుత్వ ఉపాధ్యాయ, పోలీసు, ఇతర శాఖల పోస్టులను భర్తీ చేయనున్నార. ఈ ప్రభుత్వ కొలువుల సాధనలో పైచేయి సాధించడానికి అభ్యర్థులు సంసిద్ధులవుతున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు అనుసరించాల్సిన వ్యూహాలపై నిపుణులు సూచనలు అందిస్తున్నారు.
పరీక్ష ఏదైనా సిలబస్‌ను..:
పరీక్ష ఏదైనా సిలబస్‌ను ఔపోసన పట్టాలని.. సిలబస్ ప్రామాణిక పత్రంగా పెట్టుకొని సన్నద్ధం కావాలని నిపుణులు పేర్కొంటున్నారు. అభ్యర్థులు రాయబోయే పరీక్ష సిలబస్, పరీక్ష స్వరూపాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు గత పరీక్ష ప్రశ్న పత్రాలు పరిశీలించి, వాటిపై కసరత్తు చేస్తే ఉపయోగకరంగా ఉంటాయి.
‘తెలంగాణ’కు సంబంధించిన..
రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోటీ పరీక్షల నిర్వహణకు ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) సిలబస్‌లో మార్పులు చేసింది. పోటీ పరీక్షల్లో తెలంగాణ ప్రాంత రాజకీయ–సామాజిక చరిత్రకు అధిక ప్రాధాన్యాన్ని ఇస్తూ సిలబస్ రూపొందించారు. తెలంగాణ చారిత్రక నేపథ్యం మొదలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు వరకు చోటుచేసుకున్న అనేక అంశాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమం, నక్సలిజం, రాష్ట్ర ఏర్పాటులో వివిధ రాజకీయ పార్టీల పాత్ర, టీఆర్‌ఎస్ ఏర్పా టు మొదలైన అంశాలపై కూడా పట్టు సాధించాలి.
దీనిపై పట్టు సాధిస్తే..
రాబోతున్న ఉద్యోగ పరీక్షల్లో ‘జనరల్ స్టడీస్’ ప్రతి పరీక్షలోనూ కనిపించే సబ్జెక్ట్. జీఎస్‌పై పట్టు సాధిస్తే గ్రూప్ –1 నుంచి మొదలు పంచాయతీ సెక్రటరీ పోస్టుల వరకు సగం సన్నద్ధత లభించినట్లే. అభ్యర్థులు తాము రాయబోయే పరీక్షల సిలబస్‌లో జీఎస్‌కు ఎలాంటి సిలబస్ ఇచ్చారో ఒకసారి క్షుణ్నంగా పరిశీలించి ప్రామాణిక పుస్తకాలు ఎంచుకొని సన్నద్ధమవ్వాలి. పాలిటీ, ఎకానమీ, చరిత్ర, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంట్, జాగ్రఫీ మొదలైన జనరల్ స్టడీస్ సబ్జెక్టులకు సమకాలీన అంశాలను జోడిస్తూ చదువుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
టీఎస్‌పీఎస్సీ ప్రివియస్ పేపర్స్
పుస్తకాల ఎంపికలోనూ..
ఇక పుస్తకాల ఎంపికలోనూ జాగ్రత్తగా ఉండాలి. మార్కెట్‌లో లభించే ప్రతి పుస్తకం కాకుండా తెలుగు అకాడమీ పుస్తకాలు, ఏదైనా ప్రముఖ రచయితల పుస్తకాలు సేకరించుకొని చదువుకోవాలి. ప్రతి సబ్జెక్టుకు ఏదైనా ఒక్కటే పుస్తకాన్ని పలుమార్లు రివిజన్ చేయడం మేలు. ఇటీవల కాలంలో యూట్యూబ్‌లో కొన్ని చానల్స్ ఉచితంగా పోటీ పరీక్షల సిలబస్‌ను బోధిస్తున్నాయి.
ముఖ్యంగా పోలీసు పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు..
పోటీ పరీక్ష ఏదైనా సిలబస్, ఎగ్జామ్ ప్యాట్రన్, గత ప్రశ్నపత్రాలు చూడాలి. ముఖ్యంగా పోలీసు పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఫిజికల్ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలి. కానిస్టేబుల్, ఎస్సైలకు ప్రిలిమ్స్ వరకు సిలబస్ కామన్‌గా ఉంటుంది కాబట్టి ఒకేసారి సన్నద్ధమవ్వచ్చు. ప్రధాన పరీక్ష సిలబస్ కూడా ఒకేలా కనిపిస్తున్నా మరింత లోతుగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఏఆర్, టీఎస్‌ఎస్పీ, ఎస్పీఎఫ్ పోస్టులకు రాత పరీక్షతో పాటు ఫిజికల్ ఈవెంట్స్ ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఈవెంట్స్‌లో మెరిట్ ఆధారంగా ఈ పోస్టులను సులువుగా దక్కించుకోవచ్చు.
– రాజశేఖర్, ఐరైజ్ ఫౌండర్
పోటీపరీక్షల పుస్తకాలను అందుబాటులో..
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయనున్న నేపథ్యంలో బేగంపేట బ్రాహ్మణవాడీలోని స్వామి రామానందతీర్థ మెమోరియల్ కమిటీలో పీవీ నరసింహారావు స్మారక గ్రంథాలయంలో ఉద్యోగార్థులు చదువుకునేందుకు అనుకూలమైన వాతావరణం కల్పించనున్నట్లు ఎమ్మెల్సీ, కమిటీ చైర్‌పర్సన్ వాణీదేవి తెలిపారు. కమిటీ ప్రాంగణంలోని ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆమె మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఇక్కడి గ్రంథాలయంలో అవసరమైన సమాచారం, పుస్తకాలను అందుబాటులో ఉంచుతామన్నారు. గ్రంథాలయంలో చదువుకునేందుకు అనువైన వాతావరణం కల్పించినట్లు తెలిపారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు పీవీ స్మారక గ్రంథాలయం తెరిచి ఉంటుందని ఆమె తెలిపారు. సమావేశంలో సురభి సోలార్ ఎనర్జీ కేంద్రం డైరెక్టర్ శేఖర్ మారంరాజు తదితరులు పాల్గొన్నారు.
- ఎమ్మెల్సీ వాణీదేవి
టీఎస్‌పీఎస్సీ ఆన్‌లైన్ టెస్ట్స్
ఈ ఏడాది (2022) తెలంగాణలో భర్తీ చేయనున్న గ్రూప్స్ ఉద్యోగాలు ఇవే..:
➤ గ్రూప్-1 పోస్టులు: 503
➤ గ్రూప్-2 పోస్టులు : 582
➤ గ్రూప్-3 పోస్టులు: 1,373
➤ గ్రూప్-4 పోస్టులు : 9,168
తెలంగాణలో భర్తీ చేయనున్న పోలీసు ఉద్యోగాలు : 17003
➤ కానిస్టేబుల్ సివిల్ (4965),
➤ఆర్మడ్ రిజర్వ్(4423),
➤టీఎస్‌ఎస్‌పీ(5704),
➤కానిస్టేబుల్ ఐటీ అండ్ సీ(262),
➤డ్రైవర్లు పిటీవో(100),
➤మెకానిక్ పీటీవో(21), సీపీఎల్(100),
➤సబ్ ఇన్‌స్పెక్టర్ సివిల్(415),
➤ఎస్‌ఐ ఏఆర్(69),
➤ఎస్‌ఐ టీఎస్‌ఎస్‌పీ(23),
➤ఎస్‌ఐ ఐటీ అండ్ సీ(23),
➤ఎస్‌ఐ పీటీవో(3),
➤ఎస్‌ఐ ఎస్‌ఏఅర్ సీపీఎల్(5)
➤ఏఎస్‌ఐ(ఎఫ్‌బీబీ–8),
➤సైంటిఫిక్ ఆఫీసర్(ఎఫ్‌ఎస్‌ఎల్–14),
➤సైంటిఫిక్ అసిస్టెంట్(ఎఫ్‌ఎస్‌ఎల్–32),
➤ల్యాబ్‌టెక్నిషీయన్ (ఎఫ్‌ఎస్‌ఎల్–17),
➤ల్యాబ్ అటెండెంట్(1),
➤ఎస్‌పీఎఫ్ కానిస్టేబుల్స్(390),
➤ఎస్‌ఐ ఎస్‌పీఎఫ్(12)
మొత్తం: 16,587
Competitive Exams: కోచింగ్ తీసుకోకుండా గ్రూప్స్, ఎస్‌ఐ తదితర పరీక్షల్లో విజయం సాధ్యమా..? కాదా..?
డీజీపీ ఆఫీస్:
➤హెచ్‌ఓ (59),
➤జూనియర్ అసిస్టెంట్ ఎల్‌సీ(125),
➤జూనియర్ అసిస్టెంట్ టీఎస్‌ఎస్‌పీ(43),
➤సీనియర్ రిపోర్టర్(ఇంటెలిజెన్స్–2),
➤డీజీ ఎస్‌పీఎఫ్ (2)
మొత్తం: 231
ఇవి ఫాలో అయితే.. పోలీసు ఉద్యోగం మీదే
జైళ్ల శాఖ:
➤ డిప్యూటీ జైలర్ (8),
➤ వార్డర్ (136),
➤వార్డర్ ఉమెన్ (10)
మొత్తం: 154
Inspiring Story: నేను ఎస్‌ఐ అయ్యానిలా.. అమ్మ కూలి పనులు చేస్తూ..
TS Police Jobs: 17,003 పోలీసు ఉద్యోగాలు.. సిలబస్ ఇదే..
Gandrathi Satish, SI: ఇంటర్, డిగ్రీలో ఫెయిల్..ఈ కసితోనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా..