TSPSC Group-4 Exam 2023: ఉర్దూ, ఇంగ్లిష్, తెలుగు మీడియం విద్యార్థులకు ప్రత్యేక గదులు!
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రూప్ –4 కోసం జిల్లాలో 40 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. రూట్ ఆఫీసర్స్, లైజనింగ్ ఆఫీసర్స్, ఇన్విజిలెటర్లు పరీక్ష సజావుగా జరిగేలా చూడాలన్నారు.
TSPSC Group-4 Previous papers : టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్-4 ప్రీవియస్ పేపర్స్ ఇవే.. ఎక్కువగా వచ్చే ప్రశ్నలు..
ఉర్దూ, ఇంగ్లిష్, తెలుగు మీడియం విద్యార్థులకు ప్రత్యేక గదులు కేటాయించాలని సూచించారు. పరీక్ష కేంద్రాలలో మాల్ ప్రాక్టీస్ జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, డీఈవో రాజు, డీపీవో శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఏవో రవీందర్, పరీక్షల విభాగం అధికారి లింగం తదితరులు పాల్గొన్నారు.
TSPSC: గ్రూప్–4 పరీక్ష హాల్‌టికెట్లు సిద్ధం
40 కేంద్రాల ఏర్పాటు
జిల్లాలో గ్రూప్ –4 పరీక్ష కోసం 40 కేంద్రాలను ఏ ర్పాటు చేశామని రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ పేర్కొన్నారు. జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా టీ ఎస్పీఎస్‌సీ అధికారులతో మాట్లాడారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపా రు. పరీక్షలు జరిగే సమయంలో సమీపంలో ఉన్న జిరాక్స్ కేంద్రాలను మూసివేసే విధంగా చర్యలు తీ సుకుంటామన్నారు. పోలీస్ శాఖ సహకారంతో కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జూమ్ కాన్ఫరెన్స్‌లో అడిషనల్ ఎస్పీ అన్యోన్య, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, కలెక్టరేట్ ఏవో రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
TSPSC Group 1 Prelims -2023 Exam Question Paper with Key (Held on 11.06.2023)