Skip to main content

TSPSC: గ్రూప్‌–4 పరీక్ష హాల్‌టికెట్లు సిద్ధం

సాక్షి, హైదరాబాద్‌: వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్‌–4 ఉద్యోగాల భర్తీ అర్హత పరీక్షను జూలై 1వ తేదీన నిర్వహించేందుకు తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాట్లు చేసింది.
TSPSC
గ్రూప్‌–4 పరీక్ష హాల్‌టికెట్లు సిద్ధం

అభ్యర్థుల హాల్‌టికెట్లను కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. జూన్‌  24వ తేదీ నుంచి అభ్యర్థులు వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. పరీక్ష ప్రారంభానికి ముందు 45 నిమిషాల వరకు హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునే వీలున్నా.. ముందుగా డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్ష కేంద్రాన్ని పరిశీలించుకోవాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది. జూలై 1వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు జరగనున్నట్లు కమిషన్‌ వెల్లడించింది. 

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

Published date : 24 Jun 2023 03:04PM

Photo Stories