Skip to main content

TSPSC Group I: ప్రిలిమ్స్‌లో 5 ప్రశ్నలు రద్దు.. 3 ప్రశ్నలకు మారిన ఆప్షన్లు..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 503 Group I ఉద్యోగాల భర్తీకి ఆక్టోబర్‌ 6న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష తుది ‘కీ’ని TSPSC నవంబర్‌ 15న విడుదల చేసింది.
5 questions canceled in TSPSC Group I prelims and changed options for 3 questions
గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌లో 5 ప్రశ్నలు రద్దు.. 3 ప్రశ్నలకు మారిన ఆప్షన్లు..

అభ్యంతరాల పరిశీలనకు ఏర్పాటైన నిపుణుల కమిటీ పిలిమ్స్‌లోని 150 ప్రశ్నల్లో ఐదు ప్రశ్నలను రద్దు చేయాలని, మూడు ప్రశ్నలకు ఆప్షన్లలో మార్పులు చేయాలని సిఫార్సు చేయడంతో ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు కమిషన్‌ వెల్లడించింది. ఈ విషయంలో ఇకపై ఎలాంటి అభ్యంతరాలకు తావులేదని తేల్చిచెప్పింది.

చదవండి: టీఎస్‌పీఎస్సీ | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్

ఈ ప్రశ్నలు రద్దు...

గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్ష పేపర్‌ కోడ్‌–22040 ‘కీ’ని పరిగణనలోకి తీసుకుంటే ఇందులో 29, 48, 69, 82, 138 ప్రశ్నలు రద్దయ్యాయి. దీంతో వాటిని మూల్యాంకనంలో పరిగణనలోకి తీసుకోరు. ప్రిలిమినరీ పరీక్షలో ఇచ్చిన 150 మార్కులకుగాను 145 ప్రశ్నలనే పరిగణిస్తారు. మొత్తం మార్కులను 145 ప్రశ్నలకు విభజిస్తారు. ఈ ప్రశ్నల్లో సరైన జవాబులు రాసిన వారికి విభజించిన (మూడో డెసిమల్‌ వరకు) మార్కుల ప్రకారం లెక్కిస్తారు. ఉదాహరణకు ఒక అభ్యర్థి 145 ప్రశ్నల్లో 120 ప్రశ్నలకు సరైన జవాబులు రాసినట్లయితే ఒక్కో ప్రశ్నకు 150/145 చొప్పున 120 జవాబులకు 124.137 మార్కులు నిర్దేశిస్తారు.

చదవండి: TSPSC Group-1 Cut Off Marks : గ్రూప్‌-1 మెయిన్స్‌లో నిలవాలంటే ఎన్ని మార్కులు సాధించాలంటే..

మూడు ప్రశ్నలకు మారిన ఆప్షన్లు...

ప్రిలిమినరీ పరీక్షలో 3 ప్రశ్నలకు జవాబులు మారాయి. 57వ ప్రశ్నకు జవాబు 1, 107వ ప్రశ్నకు జవాబులు 1, 2, 3, 4, చివరగా 133వ ప్రశ్నకు జవాబు 1, 2గా నిపుణుల కమిటీ సూచించగా కమిషన్‌ ఖరారు చేసింది. అతిత్వరలో మెయిన్‌ పరీక్షలకు ఎంపికయ్యే అభ్యర్థుల జాబితాను టీఎస్‌పీఎస్సీ విడుదల చేయనున్నట్లు సమాచారం.

చదవండి: TSPSC Group 1 Prelims 202 Final Key & Question Paper : గ్రూప్-1 ప్రిలిమ్స్ 'కీ' విడుద‌ల‌.. ఫ‌లితాల‌ను కూడా..

Published date : 16 Nov 2022 12:46PM

Photo Stories