Skip to main content

TSPSC Group 1 Prelims 202 Final Key & Question Paper : గ్రూప్-1 ప్రిలిమ్స్ 'కీ' విడుద‌ల‌.. ఫ‌లితాల‌ను కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించిన‌ గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్ష ఫైన‌ల్ 'కీ' ని న‌వంబ‌ర్ 15వ తేదీ(మంగ‌ళ‌వానం) విడుద‌ల చేశారు.
TSPSCGroup 1 Exam Final Key
tspsc group 1 prelims exam 2022 final key

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్ష 'కీ' ని అక్టోబ‌ర్ 29వ తేదీ(శ‌నివారం) విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. అలాగే అక్టోబ‌ర్ 31వ తేదీ నుంచి న‌వంబ‌ర్‌ 4వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరించిన విష‌యం తెల్సిందే. ప్రిలిమ్స్‌ పరీక్షలో వివిధ సిరీస్‌లలో ప్రశ్నలతో పాటు సమాధానాలను కూడా జంబ్లింగ్‌ చేసి బహుళ సిరీస్‌ల్లో ప్రశ్నపత్రాలను రూపొందించారు. 

TSPSC Group-1 Cut Off Marks : గ్రూప్‌-1 మెయిన్స్‌లో నిలవాలంటే ఎన్ని మార్కులు సాధించాలంటే..

TSPSC & APPSC : గ్రూప్-1 & 2లో ఉద్యోగం కొట్ట‌డం ఎలా? ఎలాంటి బుక్స్ చ‌ద‌వాలి..? 

గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్ష ఫ‌లితాల‌ను..
గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్ష ఫైన‌ల్ కీ కోసం టీఎస్‌పీఎస్సీ ఐడీ, హాల్‌టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి డిజిటల్‌ పత్రాలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చిని టీఎస్‌పీఎస్‌సీ పేర్కొంది. టీఎస్‌పీఎస్సీ ఏర్పాటైన తర్వాత తొలిసారిగా గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఇందులో భాగంగా 503 కొలువుల కోసం అక్టోబ‌ర్ 16వ తేదీన 1,019 పరీక్షా కేంద్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన విష‌యం తెల్సిందే. ఈ ప‌రీక్ష‌కు 2,86,051 (75%) మంది దీనికి హాజరయ్యారు. అలాగే టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్ష ఫ‌లితాల‌ను కూడా త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్న‌ది.

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్ 2022 కొశ్చ‌న్ పేప‌ర్ 

చ‌ద‌వండి: Books for Groups Preparation: కోచింగ్‌ తీసుకోకుండా గ్రూప్స్‌లో విజయం సాధించడమెలాగో తెలుసుకుందాం..

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1 ప్రిలిమ్స్ 2022లో ఏఏ స‌బ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు  వ‌చ్చాయంటే..

  స‌బ్జెక్ట్  మార్కులు
1.  ఇండియ‌న్ పాలిటీ & గవర్ననెస్ 16 
2.  ఇండియ‌న్ హిస్ట‌రీ  9
3.  తెలంగాణ హిస్ట‌రీ & క‌ల్చ‌ర్ 16
4.  జియోగ్రఫీ 16
  1. ఇండియా జియోగ్రఫీ (8 మార్కులు)  
  2. వ‌ర‌ల్డ్ జియోగ్రఫీ (3 మార్కులు)  
  3. తెలంగాణ జియోగ్రఫీ (5 మార్కులు)  
5.  ఎకాన‌మీ (ఇండియా & తెలంగాణ‌)  5
6.  సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ  22
  1.బ‌యాల‌జీ (8 మార్కులు)  
  2.ఫిజిక్స్   (4 మార్కులు)  
  3.కెమిస్ట్రీ  (3 మార్కులు)  
  4.సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (7 మార్కులు)  
7.  పర్యావరణ శాస్త్రం  4
8.  డిజార్ట్స్ మేనేజ్‌మెంట్  3
9.  క‌రెంట్ అఫైర్స్ 15
10  అంత‌ర్జాతీయ సంబంధాలు  7
11  సోష‌ల్ ఎక్స్‌క్లూజ‌న్  7
12.  రిజ‌నింగ్ & డీఐ  23
13  ఇత‌రం  2
14.  తెలంగాణ రాజ‌కీయం  5
   మొత్తం 150(మార్కులు)

టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ 2022 కొశ్చ‌న్ పేప‌ర్‌ & ఫైన‌ల్‌ 'కీ' ఇదే..

Published date : 16 Nov 2022 12:51PM
PDF

Photo Stories