Skip to main content

ఇంటర్‌తో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు

సాక్షి, హైదరాబాద్‌: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునే విద్యార్థులకు ఇంటర్మీడియెట్‌ స్థాయిలోనే అవకాశాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
Sabitha Indra Reddy
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ప్రతీ సంవత్సరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ల్లోని 20 వేల మంది విద్యార్థులకు ఈ అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటరీ్మడియెట్‌ బోర్డు ఇన్‌చార్జి కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌తో డిసెంబర్‌ 29న మంత్రి సమీక్షించారు. గణితం సబ్జెక్టు కలిగి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఫిబ్రవరిలో ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు.

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | TIME TABLE 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్

ఇందులో 60 శాతం మార్కు లు పొందిన విద్యార్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారని తెలిపారు. ఎంపికైన వారికి ఆన్‌లైన్‌లోనే ఆరు నెలల పాటు శిక్షణ ఇస్తారని, అది పూర్తయ్యాక హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కార్యాలయంలో ఆరు నెలలపా టు ఇంటర్న్‌షిప్‌ ఉంటుందన్నారు. ఇంటర్న్‌షిప్‌లో నెల కు రూ.10 వేలు ఉపకారవేతనం ఇస్తారని, ఆ తర్వాత రూ. 2.5 లక్షల వార్షిక వేతనంతో పూర్తిస్థాయి అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఉద్యోగం చేస్తూనే డిగ్రీ పూర్తి చేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. మార్చి 15న ప్రారంభమయ్యే ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 

Published date : 30 Dec 2022 03:22PM

Photo Stories