TS Inter Students : ఇంటర్ విద్యార్థుల కోసం సైకాలజిస్టులు.. మీకు ఏమన్నా సమస్య ఉంటే ఈ నంబర్‌కు కాల్ చేయండి..?
ఈ ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మనోధైర్యాన్ని ఇవ్వడానికి ప్రత్యేకంగా సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులను ఏర్పాటు చేశామని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ఈ పరీక్షలపై విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టడమే దీని ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. వార్షిక, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల వరకూ ఈ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. అవసరమైన విద్యార్థులు 14416 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ప్రతి జిల్లా ఆస్పత్రుల్లో ఉచిత మానసిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించినట్టు నవీన్ మిత్తల్ తెలిపారు.
☛ చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | TIME TABLE 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్
☛ TS Eamcet Schedule 2023 : ఎంసెట్ షెడ్యూల్ విడుదల.. ఏఏ పరీక్ష ఎప్పుడంటే..?
సాత్విక్ ఆత్మహత్య నేపథ్యంలో..
హైదరాబాద్‌లో ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య నేపథ్యంలో పరీక్షల ఒత్తిడి, ఇతర మానసిక సమస్యలు ఉంటే మానసిక నిపుణులకు చెప్పుకొని పరిష్కరించుకునేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కొత్తగా టోల్ ఫ్రీ నంబరును అందుబాటులోకి తెచ్చింది.గతంలో కొందరు సైకాలజిస్టులను ఇంటర్‌బోర్డు నియమించేది. తాజాగా టెలీ మెంటల్ హెల్త్ అసిస్టెన్స్ అండర్ నెట్‌వర్కింగ్ అక్రాస్ ది స్టేట్స్(టెలీ-మానస్) పేరిట టోల్ ఫ్రీ నంబరు 14416ను తీసుకొచ్చారు. ఈ నంబరుకు ఉచితంగా ఫోన్ చేసి పరిష్కారం పొందొచ్చు.
TS Inter Public Exams : 9,48,010 మంది విద్యార్థులు పరీక్షలకు.. వీరిపై ప్రత్యేక నిఘా.. ఎందుకంటే..?
మీకు తగిన పరిష్కారాలను..
ఇంటర్ వార్షిక, సప్లిమెంటరీ పరీక్షలు, ఫలితాల ప్రకటన సమయాల్లో దాన్ని వినియోగించుకోవచ్చని ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ తెలిపారు. సైకాలజిస్టులు, సైకియాట్రిస్ట్‌లు అందుబాటులో ఉండి కౌన్సెలింగ్ ద్వారా విద్యార్థులకు తగిన పరిష్కారాలను సూచిస్తారు. ఇది రోజంతా పనిచేస్తుంది. అంతేకాకుండా ఆయా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ క్లినిక్‌ల పేరిట ఉచితంగా సైకాలజిస్టులు సేవలు అందిస్తారు. వారిని స్వయంగా కలిసి సమస్యలను పరిష్కరించుకోవచ్చు.
పూర్తి వివరాలు ఇవే..