TS Eamcet Schedule 2023 : ఎంసెట్ షెడ్యూల్ విడుదల.. ఏఏ పరీక్ష ఎప్పుడంటే..?
అలాగే పీజీ ఈసెట్ షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు. టీఎస్ ఎంసెట్‌కు మార్చి 3వ తేదీన నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుముతో మే 2 వరకు ఎంసెట్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.
చదవండి: EAMCET 2023: ఈసారి ఎంసెట్‌కు ఇంత శాతం సిలబస్ మాత్రమే
టీఎస్ ఎంసెట్ పరీక్షను..
ఏప్రిల్ 30వ తేదీన నుంచి ఎంసెట్ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. మే 7, 8, 9 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ పరీక్షలు జరగనున్నాయి. మే 10, 11న అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్ష జరగనుంది. ఈ పరీక్షలు ఉదయం 9 నుంచి 12 వరకు మొదటి సెషన్ పరీక్ష, మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు రెండవ సెషన్ పరీక్ష పరీక్ష ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఎంసెట్ ఫీజు రూ.500 రూపాయలుగా ఇతర విద్యార్థులకు ఎంసెట్ ఫీజు రూ.900 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
Also Read: EAMCET - QUICK REVIEW | BIT BANK | GUIDANCE | MODEL PAPERS | PREVIOUS PAPERS | PRACTICE QUESTIONS
పీజీ ఈసెట్ సమగ్ర వివరాలు ఇవే..
అలాగే ఫిబ్రవరి 28న పీజీ ఈసెట్ సమగ్ర నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. మార్చి 3వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుంతో మే 24 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. మే 21వ తేదీ నుంచి పీజీ ఈసెట్ హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. మే 29వ తేదీన నుంచి జూన్ 1 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.
చదవండి: ఎంసెట్ - న్యూస్ | గైడెన్స్ | గెస్ట్ కాలమ్