Skip to main content

TS EAMCET Hall Ticket Released: తెలంగాణ ఎంసెట్‌ హాల్‌టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

TS EAMCET Hall Ticket Released  Official Website for Hall Ticket Download  Telangana EAPSET 2024 Hall Ticket

తెలంగాణ ఈఏపీసెట్‌ (ఎంసెట్‌)- 2024 హాల్‌టికెట్లు విడుదల అయ్యాయి. అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌ఈఏపీసెట్‌-2024 హాల్‌టికెట్స్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు eapcet.tsche.ac.in/ నుంచి హాల్‌టికెట్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

మే 1 నుంచి ఇంజినీరింగ్‌ హాల్‌టికెట్స్‌ అందుబాటులో ఉంటాయి. కాగా TS EAPCET 2024 పరీక్షకు దాదాపు 3.5 లక్షల మందికి పైగా అప్లై చేశారు. ఇంజినీరింగ్‌ విభాగానికి పరీక్షలకు 2.5 లక్షల మంది, అగ్రికల్చర్‌, ఫార్మా పరీక్షలకు 98 వేల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

రూ.5 వేల అపరాధ రుసుముతో మే 1వ తేదీ వరకు ఇంకా దరఖాస్తు చేసుకునేందుక అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం.. మే 7, 8, 9, 10, 11వ తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. కంప్యూటర్ ఆధారిత (CBT) మోడ్‌లో మూడు గంటల పాటు నిర్వహించనున్నారు. 


TS EAMCET 2024 హాల్‌టికెట్‌ను ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి. 

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ eamcet.tsche.ac.inను క్లిక్‌ చేయండి. 
  • హోం పేజీలో కనిపిస్తున్న హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ అనే లింక్‌పై క్లిక్‌ చేయండి.
  • రిజిస్ట్రేషన్‌ నెంబర్‌/పుట్టిన తేదీ వివరాలతో లాగిన్‌ అవ్వండి
  • TS EAMCET 2024 హాల్ టికెట్ మీ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది.
  • తర్వాత హాల్‌టికెట​్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి. 
Published date : 29 Apr 2024 03:57PM

Photo Stories