EAMCET 2023: ఈసారి ఎంసెట్‌కు ఇంత శాతం సిలబస్ మాత్రమే
2023లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మొదటి సంవత్సరంలో 70% సిలబస్ అమలు చేశారు. ఈ కారణంగా ప్రాక్టికల్స్‌లోనూ ఇదేస్థాయిలో సిలబస్‌ను ఇంటర్ బోర్డు నిర్ణయించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎంసెట్‌లోనూ 2023కి 70% సిలబస్‌తో పరీక్ష ఉండాలని మండలి భావించింది. మే 7వ తేదీ నుంచి ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు మొదలవుతాయి. ఇందుకు సంబంధించిన తేదీలను ప్రకటించినప్పటికీ, పూర్తి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది.
చదవండి: ఎంసెట్ - న్యూస్ | గైడెన్స్ | గెస్ట్ కాలమ్
ఇంటర్ హాల్ టికెట్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎంసెట్ తేదీలను ఖారారు చేయాలని భావిస్తున్నారు. మరోవైపు ఇంటర్ మార్కుల వెయిటేజ్‌పై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. జేఈఈ ఇతర జాతీయస్థాయి పరీక్షలకు అకడమిక్ వెయిటేజ్ తీసుకోవడం లేదు. మన రాష్ట్రంలో జరిగే ఎంసెట్ కూడా కరోనా సమయం నుంచి ఇంటర్ వెయిటేజ్ పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇక నుంచి ఇదే విధానం అమలు చేయాలని భావిస్తున్నారు. దీనికి ఉత్తర్వులు విడుదలవ్వాల్సి ఉంది.
Also Read: EAMCET - QUICK REVIEW | BIT BANK | GUIDANCE | MODEL PAPERS | PREVIOUS PAPERS | PRACTICE QUESTIONS