TS Inter Results: గురుకులాలు భేష్.. ప్రభుత్వ కాలేజీలు డౌన్.. సొసైటీల వారీగా ఉత్తీర్ణత శాతం ఇలా
రాష్ట్రంలో అత్యంత ఎక్కువ సంఖ్యలో ఉన్న మహాత్మా జ్యోతిభా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతులు సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) నుంచి ఫస్టియర్, సెకండియర్‌లో అత్యధిక మార్కులు సొంతం చేసుకున్నారు. టాప్ 10లో సగం ర్యాంకులు ఈ సొసైటీకే సొంతమయ్యాయి. మేనేజ్‌మెంట్ల వారీగా చూస్తే.. గురుకుల కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం పెరిగితే.. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మాత్రం తగ్గిపోయింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఫస్టియర్ కేవలం 40 శాతమే ఉత్తీర్ణత నమోదైంది. రెండో ఏడాది కూడా 54 శాతమే పాసయ్యారు.
చదవండి: Best Non-Engineering Courses After Inter: ఇంజనీరింగ్‌తోపాటు అనేక వినూత్న కోర్సులు !!
విద్యాశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఆర్‌ఈఐఎస్) 92శాతం ఉత్తీర్ణతతో ముందు వరుసలో నిలబడింది. వివిధ వర్గాలకు చెందిన గురుకుల కాలేజీల్లోనూ విద్యార్థులు ఎక్కువ మంది పాసయ్యారు. కానీ మోడల్ స్కూళ్లలో మాత్రం ఫ్యాకల్టీలోపం వల్ల ఉత్తీర్ణత శాతం 66కు మించలేదు. ప్రైవేటు కాలేజీల్లోనూ ఈసారి 63 శాతమే ఉత్తీర్ణత నమోదైంది. ప్రభుత్వ జూనియర్ కామోడల్ స్కూల్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాల విడుదల సందర్భంగా పేర్కొనడం గమనార్హం. రెసిడెన్షియల్ కాలేజీల తరహాలో ఉత్తీర్ణత సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని అధికారులకు మంత్రి సూచించారు.
చదవండి: Best Course After Intermediate MPC: ఎంపీసీ.. ఇంజనీరింగ్‌తోపాటు మరెన్నో!
కార్పొరేట్‌కు దీటైన ఫలితాలివి: మంత్రి గంగుల కమలాకర్
ప్రైవేటు కాలేజీలు, కార్పొరేట్ కాలేజీలకు దీటైన ఫలితాలను గురుకుల పాఠశాలలు సాధించాయి. బీసీ గురుకుల సొసైటీ నుంచి అద్భుతమైన ర్యాంకులు రావడం ఆనందకరం. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో మందమర్రికి చెందిన హరిత 468 మార్కులు సాధించి ఫస్ట్ ర్యాంకు కొట్టింది. ఇక సికింద్రాబాద్‌కు చెందిన భూమిక 467 మార్కులతో రెండో ర్యాంకు సాధించింది. ఇంతటి అద్భుత పలితాలు సాధించిన సొసైటీ కార్యదర్శి మల్లయ్యబట్టు, బోధన, బోధనేతర సిబ్బందికి ప్రత్యేక అభినందనలు.
చదవండి: Paramedical Courses: ఈ కోర్సులో చేరితే.. కొలువు పక్కా! ఉద్యోగం కాదనుకుంటే...
ఉన్నత అవకాశాల్లోనూ ముందే..: మంత్రి కొప్పుల
ఉత్తమ ఫలితాల్లోనే కాకుండా ఉన్నత ఉద్యోగాలను చేజిక్కించుకుంటున్న వారిలో గురుకుల విద్యార్థులుంటున్నారు. ఈసారి ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరాల్లో గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని గురుకులాలను నిర్వహిస్తున్నందున మంచి ఫలితాలు వచ్చాయి.
చదవండి: Nutrition Courses: ఆహార కోర్సులు... అద్భుత అవకాశాలు!!
పేదల విద్యకు ప్రాధాన్యత: మంత్రి సత్యవతి రాథోడ్
రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గురుకుల పాఠశాలలను పెద్ద సంఖ్యలో తెరిచి పేదలకు కేజీ టు పీజీ విద్య అందించే లక్ష్యాన్ని మొదలుపెట్టారు. ఇందులోభాగంగా గురుకులాలు రికార్డులు సాధిస్తున్నాయి. ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నందునే గురుకులాల విద్యార్థులు కార్పొరేట్ కాలేజీల కంటే మెరుగైన ఫలితాలను సాధిస్తున్నారు.
చదవండి: Career in Nursing: ఏ కోర్సు చేసినా ఉజ్వల కెరీర్ ఖాయం... నెలకు రూ.44 వేల వరకు జీతం
సొసైటీల వారీగా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత శాతం ఇలా...
సొసైటీ |
ఉత్తీర్ణత |
టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ |
89% |
టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ |
84% |
ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ |
87% |
టీఎంఆర్‌ఈఐఎస్ |
83% |
టీఆర్‌ఈఐఎస్ |
92% |