Skip to main content

Nutrition Courses: ఆహార కోర్సులు... అద్భుత అవకాశాలు!!

ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రస్తుత కరోనా కాలంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం విలువ మరింత ఎక్కువగా తెలిసొచ్చింది. అందుకే తినే ఆహారం..అది ఆరోగ్యంపై చూపే ప్రభావం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకుంటే.. రోగ నిరోధక శక్తి పెరిగి.. వైరస్‌ల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. వేటిలో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో తెలిపే నిపుణులే.. న్యూట్రిషియన్లు/డైటిషియన్లు! నిత్యనూతనంగా విస్తరిస్తున్న ఆహార రంగంలో అవకాశాలను అందించే.. ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ కోర్సులు, కెరీర్‌ మార్గాలపై ప్రత్యేక కథనం..
Careers In Food Nutrition Sector
Careers In Food Nutrition Sector

ఆరోగ్యకరమైన జీవితానికి పోషకాహారం ఎంతో అవసరం. ఆహారంలో సమతుల్యత లేకుంటే.. అది ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. సరైన ఆహారం, సరైన సమయానికి, సరైన మోతాదులో తినకపోవడంవల్ల బీపీ, షుగర్, ఎసిడిటీ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. పౌష్టి కాహారంపై మార్గం నిర్దేశం చేసే వారే న్యూట్రిషి యన్లు/డైటిషియన్లు. ప్రస్తుతం వీరికి మంచి డిమాండ్‌ఉంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పట్ల ప్రజ లకు శ్రద్ధ పెరగడంతో ఫిట్‌నెస్, మెడికల్‌ రంగాల్లో వీరి అవసరం నెలకొంది. దాంతో న్యూట్రిషన్, డైటిషియన్‌ కోర్సులను పూర్తిచేసిన అభ్యర్థులకు చక్కటి అవకాశాలు లభిస్తున్నాయి. 


న్యూట్రిషన్‌గా మారాలంటే

  • ఇంటర్‌తర్వాత న్యూట్రిషన్‌గా మారాలంటే.. బీఎస్సీ స్థాయిలో న్యూట్రిషన్‌/డైటిషియన్‌కోర్సులను అభ్యసించాలి. దీనిద్వారా ఆయా విభాగాల్లో ప్రాథమిక భావనలపై పరిజ్ఞానం పొందడానికి అవకాశం ఉంటుంది.
  • అదేవిధంగా ఇంటర్‌లేదా తత్సమాన విద్యార్హతతో బీఎస్సీ హోంసైన్స్‌లేదా బీఏ హోం సైన్స్‌ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. ఈ డిగ్రీ పూర్తిచేసిన వారు పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో.. ఫుడ్‌ సైన్సెస్‌ అండ్‌ న్యూట్రిషన్‌ను స్పెషలైజేషన్‌గా ఎంపిక చేసుకోవచ్చు.
  • అలాగే ఎమ్మెస్సీలో క్లినికల్‌న్యూట్రిషన్, ఫుడ్‌సై న్స్, స్పోర్ట్స్‌న్యూట్రిషన్, పబ్లిక్‌ హెల్త్‌ న్యూ ట్రిషన్‌వంటి స్పెషలైజేషన్లు ఎంపిక చేసు కోవాలి. సదరు అంశాల్లో విస్తృత అవగాహన సొంతం చేసుకోవాలి. దాంతోపాటు ఆచరణా త్మకమైన జ్ఞానం, విశ్లేషణ, కమ్యూనికేషన్‌నైపుణ్యాలను పెంపొందించుకోవాలి.   


కోర్సులను అందిస్తున్న సంస్థలు

  • తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలోని ప్రొఫెసర్‌జయశంకర్‌వ్యవసాయ విశ్వవిద్యాలయం, నేషనల్‌ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌న్యూట్రిషన్‌(హైదరాబాద్‌); ఆంధ్రప్రదేశ్‌లోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ  కోర్సుల ను అందిస్తున్నాయి.
  • వీటితోపాటు పంజాబ్‌వ్యవసాయ విశ్వవిద్యా లయం, పుణె యూనివర్సిటీ, అలహాబాద్, యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌హోం ఎకనామిక్స్, మద్రాస్‌వర్సిటీ వంటి సంస్థలు.. ఫుడ్‌సైన్స్, న్యూట్రిషన్, హోంసైన్స్‌తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి.  


కెరీర్‌మార్గాలు ఇవిగో 
క్లినికల్‌ న్యూట్రిషన్‌
క్లినికల్‌ న్యూట్రిషన్‌ అనేది న్యూట్రిషన్‌ అండ్‌ డైటీషన్‌ విభాగాల్లో ఒకటి. శస్త్ర చికిత్స తర్వాత రోగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు అవసర మయ్యే ఆహారాన్ని సిఫార్సు చేసే నిపుణులే.. క్లినికల్‌ న్యూట్రిషనిస్ట్‌లు. వైద్యుల సూచనలకు అనుగుణంగా వీరు రోగులకు ఉపయోగపడే డైట్‌ను సిఫార్సు చేస్తారు. డిగ్రీలో బీఎస్సీ ఇన్‌న్యూట్రిషన్‌ అండ్‌ డైటీషన్‌ కోర్సులను పూర్తి చేసిన వారు హాస్పిటల్స్, హెల్త్‌క్లినిక్స్, హెల్త్‌సెంటర్స్‌ అండ్‌ ఎంఎన్‌సీ వంటి వాటిలో న్యూట్రిషన్‌ అండ్‌ డైటీషన్‌గా పనిచేయవచ్చు. 


పబ్లిక్‌ హెల్త్‌ న్యూట్రిషనిస్ట్‌
రక్త హీనత, విటమిన్‌ఏ, డయాబెటిస్, అయో డిన్‌లోపం వంటి పోషకాహారానికి సంబం ధించిన  ప్రజారోగ్య సమస్యలపై దృష్టిసారించే వారే.. పబ్లిక్‌హెల్త్‌ న్యూట్రిషనిస్ట్‌లు. న్యూట్రిషన్‌ అండ్‌ డైటీషన్‌కు సంబంధించి గ్రాడ్యుయేషన్‌ స్థాయి కోర్సులు పూర్తి చేసినవారు.. పీహెచ్‌ఎఫ్‌ఐ, డబ్ల్యూహెచ్‌వో, యూనిసెఫ్, ఇతర హెల్త్‌ ఆర్గ నైజేషన్లలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్, ప్రాజెక్ట్‌ అసో సియేటెడ్‌గా పనిచేయవచ్చు. ఎన్‌జీవోలు లేదా ఇతర ప్రయివేట్‌ సంస్థల్లో చీఫ్‌ న్యూట్రిషనిస్ట్‌గా అవకాశం సొంతం చేసుకోవచ్చు.


స్పోర్ట్స్‌ న్యూట్రిషన్‌
క్రీడాకారుల ఆహార అలవాట్లలో మార్పులు చేర్పులు చేసి.. ఆయా క్రీడల్లో వారి ఆటతీరు మెరుగుపడేలా శిక్షణ ఇచ్చే నిపుణులే.. స్పోర్ట్స్‌ న్యూట్రిషన్స్‌. క్రీడాకారులు మానసికంగా, శారీ రకంగా ధృడంగా ఉండేలా పోషకాహారాలను వీరు సూచిస్తారు. వీరు ముఖ్యంగా క్రీడా శిక్షణ, జిమ్‌లు, ఫిట్‌నెస్‌ సెంటర్‌ తదితరాల్లో న్యూట్రిష నిస్ట్‌లుగా అవకాశాలు పొందవచ్చు. స్పోర్ట్స్‌అథారిటీ ఆఫ్‌ఇండియాకు చెందిన స్పోర్ట్స్‌అకా డమీలతోపాటు ఇతర స్పోర్ట్స్‌సంస్థలు, ఫెడ రేషన్లు, స్పోర్ట్స్‌సప్లిమెంటరీ పరిశ్రమల్లో ఉద్యో గాలు పొందవచ్చు. అలాగే స్పోర్ట్స్‌న్యూట్రిషన్‌ ఉపాధ్యాయులుగా, విద్యా సంస్థల్లో  అధ్యాప కులుగా, రీసెర్చర్లుగా పనిచేయవచ్చు. అంతేకా కుండా సొంతంగా ఫిట్‌నెస్‌ సెంటర్‌లను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.


ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
న్యూట్రిషన్‌కు సంబంధించి మరో విభాగమే.. ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ. ఈ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు ఫుడ్‌ ఆడిటర్‌/ఫుడ్‌క్వాలిటీ కంట్రోలర్, ఆర్‌అండ్‌డీ సెంటర్స్‌లో.. ఫుడ్‌ సైంటిస్ట్, ఫుడ్‌ ఇండస్ట్రీలో రీసెర్చ్‌ అసోసియేట్, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐ వంటి వాటిలో కన్సల్టెంట్లుగా అవకాశాలను దక్కించుకోవచ్చు.


వేతనాలు
పనిచేసే సంస్థను బట్టి న్యూట్రిషనిస్ట్‌లు నెలకు రూ.30,00 నుంచి రూ.50,000 వరకు వేతనంగా పొందవచ్చు. పనితీరు, అనుభవానికి అను గణంగా వేతనాలు పెరుగుతాయి. సొంత ఫిట్‌నెస్‌సెంటర్‌ఏర్పాటు ద్వారా స్వయం ఉపాధి పొందే అవకాశముంది.

  

  

Published date : 06 Sep 2021 06:11PM

Photo Stories