Junior College Principal: విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి
![Fresher's Day celebrations at Govt Junior College](/sites/default/files/images/2023/09/16/jr-college-principal-1694856325.jpg)
మల్హర్: విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి, తాడిచర్ల జూనియర్ కళాశాల ప్రిన్స్‌పాల్ దేవరాజం అన్నారు. మండలంలోని తాడిచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు స్వాగతం పలికారు. ఇందులో భాగంగా దేవరాజం మాట్లాడారు. ప్రభుత్వ కళాశాలలో వసతులు, సౌకర్యాలు వినియోగించుకొని విద్యార్థులు చక్కగా చదువుకోవాలని తెలిపారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని క్రమశిక్షణతో చదివి ఉన్నతంగా ఎదగాలని తల్లిదండ్రులకు, కళాశాలకు మంచిపేరు తీసుకురావాలన్నారు. సమయపాలన, కార్యదీక్షత వంటి మంచి లక్షణాలు అలవర్చుకొని పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆశించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింతలపల్లి మల్హల్‌రావు, సర్పంచ్ సుంకరి సత్తయ్య, అధ్యాపకులు పాల్గొన్నారు.