Telangana: టీచర్ల బదిలీ, పదోన్నతుల ప్రక్రియ షురూ
కోర్టుకు సంబంధించిన కేసులన్నీ క్లియర్ చేయడంతో సెప్టెంబర్ 15న నుంచి బదిలీల ఆప్షన్లు పెట్టుకునే పనిలో నిమగ్నయ్యారు. జిల్లాలో బదిలీలకు సంబంధించి 1977 దరఖాస్తులు వచ్చాయి. గెజిటెడ్ హెచ్‌ఎం పోస్టులు 99 ఖాళీగా ఉండగా 41ఖాళీలు, 41వర్కింగ్, 17లాంగ్ స్టాండింగ్‌గా నమోదయ్యాయి.
చదవండి: Student Education: శిక్షణ కాస్త శిక్షగా మారింది
80శాతానికి పైగా దరఖాస్తులు
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 651ఉన్నాయి. 3,173 ఉపాధ్యాయ పోస్టులుండగా, 2,786 మంది పనిచేస్తున్నారు. 387పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 70శాతం పోస్టులు పదోన్నతులు, 30శాతం డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. మరోవైపు బదిలీకోసం జిల్లాలో 1,977మంది దరఖాస్తులు చేసుకున్నారు.
గెజిటెడ్ హెచ్‌ఎంలకు సెప్టెంబర్ 17న బదిలీ ఉత్తర్వులు ఇస్తారు. దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుల్లో జిల్లావ్యాప్తంగా 60కి పైగా అభ్యంతరాలు రాగా విద్యాశాఖ అధికారులు క్లియర్ చేసినట్లు సమాచారం. దీంతో 80 శాతానికి పైగా ఉపాధ్యాయులు బదిలీల కోసం దరఖాస్తులు చేసుకున్నారు.
చదవండి: Govt Teachers: ఉపాధ్యాయులకు అమలెప్పుడో..?
అడ్డదారులు
బదిలీల కోసం టీచర్లు చేయని ప్రయత్నాలు లేవు. అధిక పాయింట్లు పొంది కోరుకున్న చోటుకి వెళ్లాలన్న ఆలోచనతో కొంత మంది తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ప్రయత్నాలు చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు మెడికల్ రిపోర్టులో మాయలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. లేని రోగాలు ఉన్నటు విద్యాశాఖకు రిపోర్టు సమర్పించినట్లు ఆ రోపణలు వస్తున్నాయి.
వేటు తప్పదు
బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. ఎవరైనా తప్పుడు ధ్రువీకరణపత్రాలతో అవకతవకలకు పాల్పడినట్లు ఫిర్యాదు అందితే ఆ ఉపాధ్యాయులపై సస్పెండ్ వేటు తప్పదు. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు ఉపాధ్యాయులు సహకరించాలి.
– సీహెచ్ జనార్దన్‌రావు, డీఈవో