Student Education: శిక్షణ కాస్త శిక్షగా మారింది
Sakshi Education
విద్యార్థులకు ఉన్నతి శిక్షణ అందించాల్సిన ఉపాధ్యాయులు వారికి శిక్షణ అందించే క్రమంలో విద్యార్థులకు అది శిక్షగా మారింది. ఈ వార్త ఇప్పుడు ఉపాధ్యాయులపై విమర్శగా దారి తీసింది.
సాక్షి ఎడ్యుకేషన్: విద్యార్థులకు మరింత నాణ్యమైన బోధన జరిగేలా ప్రభుత్వం ఉపాధ్యాయులకు ‘ఉన్నతి’ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టగా అది కాస్తా విద్యార్థులకు ‘శిక్ష’గా మారింది.
Sports Competition: విద్యార్థుల గేమ్స్ పోటీలకు షెడ్యూల్ విడుదల
డైట్ కళాశాలలో నిర్వహించిన ఉన్నతి శిక్షణ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఉపాధ్యాయులకు సరిపడా కుర్చీలు అందుబాటులో లేకపోవడంతో ఎన్జీవో పాఠశాల నుంచి పదిమంది విద్యార్థులను పిలిచించి పక్కనే ఉన్న గదిలో నుంచి కుర్చీలు మోయించారు. అటెండర్లు ఉన్నప్పటికీ విద్యార్థుల చేత కుర్చీలు మోయించడం విమర్శలకు దారి తీసింది.
Published date : 12 Sep 2023 02:39PM