Skip to main content

TSBIE: ఇంటర్‌లో ఇంగ్లిష్‌ ప్రాక్టికల్స్‌

ఆసిఫాబాద్‌రూరల్‌: ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరం నుంచి ఆంగ్లంలో ప్రాక్టికల్స్‌ విధానానికి ఇంటర్‌ బోర్డు శ్రీకారం చుట్టింది.
TSBIE
ఇంటర్‌లో ఇంగ్లిష్‌ ప్రాక్టికల్స్‌

విద్యార్థి జీవిత లక్ష్యం చేరేందుకు పదో తరగతి తర్వాత ఇంటర్‌ విద్య వేదికగా భావిస్తారు. ప్రస్తుతం అన్నిరంగాల్లో ఆంగ్ల విద్యకు ప్రాధాన్యత ఎక్కువగా ఉండడంతో విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ సమగ్ర వికాసం చెందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇంగ్లిష్‌ విద్యలో పట్టుసాధిస్తే ఉద్యోగ సాధనలో సైతం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లిష్‌లో ప్రాక్టికల్స్‌ అమలు చేయనుంది.

జిల్లాలో ఇదీ పరిస్థితి...

జిల్లాలో మొత్తం 48 జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ కళాశాలలు 11, ప్రైవేట్‌ కళాశాలలు 05, కేజీబీవీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలు 32 ఉన్నాయి. మొత్తం 11,018 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 5,843 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5,175 మంది ఉన్నారు. వారందరికీ ఈ విద్యాసంవత్సరం నుంచి ఆంగ్లంపై పట్టు సాధించేలా ఇంటర్‌ బోర్టు ఇంగ్లిష్‌ సెబ్జెక్ట్‌కు సైతం సైన్స్‌ కోర్సుల మాదిరి ప్రాక్టికల్స్‌ అమలు చేయనుంది.

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్

ప్రాక్టికల్స్‌ ఇలా....

ప్రాక్టికల్స్‌ను మొత్తం ఐదు విభాగాలుగా విభజించారు. ప్రాక్టికల్స్‌కు 20 మార్కులు, థియరీకి 80 మార్కులు కేటాయించారు. కమ్యూనికేటివ్‌ ఫంక్షన్స్‌కు 4 మార్కులు, ఏదైనా ఒక సామాజిక అంశంపై ఇంగ్లిష్‌లో తప్పులు లేకుండా మాట్లాడడానికి 4, స్పష్టంగా చదవడానికి 4, రోల్‌ప్లే (వివిధ సందర్భాల్లో ఇద్దరి మధ్య సంభాషణ)కు 4 మార్కులు, వింటూ అర్థం చేసుకోవడానికి 4 మార్కులు ఉంటాయి. ఇలా ఒక్కో దశకు నాలుగు మార్కుల చొప్పున 20 మార్కులు కేటాయిస్తారు. విద్యార్థులు పలు రకాల ప్రశ్నలను తయారు చేసుకుంటే ఉపాధ్యాయులు సందర్భం ఆధారంగా ప్రశ్నించేతత్వాన్ని నేర్పిస్తారు.

ఆంగ్లంపై పట్టు సాధించేలా...

విద్యార్థులు ఆంగ్లంపై పట్టు సాధించేలా ఇప్పటి నుంచి ఇంగ్లిష్‌ సామర్థ్యాలను నేర్పిస్తున్నారు. చాలామంది విద్యార్థులు ఇంగ్లిష్‌ అంటేనే భయపడుతుంటారు. దీనిని గమనించిన ప్రభుత్వం విద్యార్థులకు ఇంగ్లిష్‌ భాషపై మక్కువ పెంచేలా చర్యలు చేపడుతోంది. చదవడం, రాయడం, మాట్లాడడం అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

సంభాషణ ద్వారా 30 రకాల మాడ్యూళ్లలో విద్యార్థుల మధ్య కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంపొందించడం, ఆడియో, వీడియో ద్వారా నేర్చుకోవడం, నేర్చుకున్న దాన్ని నెమరు వేసుకోవడం వంటి స్కిల్స్‌ పెంపొందించడం వంటివి నేర్పిస్తున్నారు. ఇంగ్లిష్‌ సబ్జెక్టు ప్రాక్టికల్స్‌ నిర్వహించే ముందు ప్రాక్టికల్‌ విధానంతో విద్యార్థులకు ఆంగ్లంపై కమ్యూనికేషన్‌ పెరిగి భవిష్యత్‌లో ఉద్యోగ సాధనతో పాటు ఏ ప్రాంతానికి వెళ్లినా సులభంగా అక్కడ పరిస్థితులు తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది.

Published date : 21 Aug 2023 04:00PM

Photo Stories