School Education Department: నేటి నుంచి బడిబాట.. బడిబాట షెడ్యూల్ ఇలా..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల శాతాన్ని పెంచ డం బడిబాట ముఖ్య ఉదేదశం. ఇందులో భాగంగా డీఈవోలు, హెచ్‌ఎంలు, టీచర్లకు ప్రోత్సాహకాలు ప్రకటించింది. బడిబాటలో అత్యధికంగా ఎన్‌రోల్ మెంట్ నమోదైన టాప్ –3 జిల్లాలు, రాష్ట్రంలోని టాప్ –10 పాఠశాలలను గుర్తించి ఘనంగా సన్మానిస్తామని వెల్లడించింది. బడిబాట షెడ్యూల్, మార్గదర్శకాలను తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ఇటీవల విడుదల చేశారు. ఈ మేరకు జిల్లాస్థాయి లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు ఇతర శాఖలు, అధికారులతో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. జూన్ 2న మండల, జిల్లాస్థాయిలో సమన్వయ సమావేశాలు, పలు చోట్ల గ్రామసభను నిర్వహించి సర్పంచ్ ఎస్‌ఎంసీ సహా అందరిని భాగస్వామ్యం చేస్తున్నారు. జూన్ 12 నుంచి 17 వరకు షెడ్యూల్ ప్రకారం పిల్లలను బడుల్లో చేరుస్తారు. జిల్లా, మండలాల్లో బడిబాట హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసి, రోజువారీ ఎన్‌రోల్‌మెంట్ వివరాలను అందజేయాలని ఆదేశాలిచ్చా రు. బడికి వెళ్లని చిన్నారుల గుర్తింపునకు స్వయం సహాయక బృందాల తోడ్పాటు తీసుకుంటారు.
చదవండి: Skills: విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపునకు చర్యలు
రెండు షెడ్యూళ్లలో..
‘బడిబాట’ను ఈ ఏడాది రెండుగా విభజించారు. అడ్మిషన్ల సంఖ్యను పెంచేందుకు జూన్ 3 నుంచి 9 వరకు స్పెషల్ ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తారు. జూన్ 12 నుంచి 17 వరకు షెడ్యూల్‌లో.. టీచర్లంతా ఉదయం 7 నుంచి 11 గంటల వరకు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తారు. ఇంగ్లిష్ మీడియం చదువు, ‘మన ఊరు మన బడి’వంటి కార్యక్రమాల ప్రాధాన్యతను వివరిస్తారు. బాలకార్మికులు, బడి బయటున్న చిన్నారులను నమోదుకు కృషిచేస్తారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులను ప్రాథమిక పాఠశాలల్లో, 5వ తరగతి పూర్తిచేసిన వారిని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చేర్పిస్తారు.
చదవండి: School Education Department: ఉచిత విద్యకు ఇంత మంది విద్యార్థులు ఎంపిక
బడిబాట షెడ్యూల్..
తేదీ |
కార్యక్రమాలు |
జూన్ 3–9 |
ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ |
జూన్ 12–6–23 |
మన ఊరు –మన బడి, మన బస్తీ –మన బడి |
జూన్ 13–6–23 |
తొలిమెట్టు |
జూన్ 14–6–23 |
సామూహిక అక్షరాభ్యాసం |
జూన్ 15–6–23 |
ప్రత్యేకావసరాలు, బడి బయట విద్యార్థుల నమోదు |
జూన్ 16–6–23 |
ఇంగ్లిష్ మీడియంపై అవగాహన |
జూన్ 17–6–23 |
బాలికల విద్య, గైడెన్స్ |