Skills: విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపునకు చర్యలు
‘నాణ్యమైన కార్యాచరణ ప్రణాళిక తయారీ’ అంశంపై విజయవాడలో జరిగిన శిక్షణ సదస్సు మే 24న ముగిసింది. జిల్లా రిసోర్స్ పర్సన్స్, పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష, ఎస్సీఈఆర్టీ సిబ్బందికి యూనిసెఫ్, సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ పబ్లిక్ సిస్టం (సిప్స్), సేవ్ ది చిల్డ్రన్ భాగస్వామ్యంతో అభ్యసన అభివృద్ధి కార్యక్రమాలపై శిక్షణ ఇచ్చారు.
చదవండి: ఈ బీటెక్ విద్యార్థిని ప్రపంచానికి పాఠాలు చెబుతోందిలా..
ఇందులో పాల్గొన్న శ్రీనివాసరావు మాట్లాడుతూ..ప్రభుత్వంఆధ్వర్యంలో నడుస్తోన్న పాఠశాలల్లో 6,7,8 తరగతుల విద్యార్థుల్లో అభ్యసన నైపుణ్యాలను పెంపొందించేందుకు వారి సామర్థ్యాన్ని బట్టి పదాలస్థాయి, వాక్య నిర్మాణం, గణితం, సమాచార సామర్థ్యం పెంపు వంటి అంశాల్లో నాణ్యమైన శిక్షణ ఇవ్వాలన్నారు. అందుకోసం ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈ విద్యా సంవత్సరం 10 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో అమలు చేస్తామని చెప్పారు.
చదవండి: విద్యార్ధులపై వత్తిడిలేని విద్య తీసుకురావాలి: సీఎం వైఎస్ జగన్