School Education Department: ఉచిత విద్యకు ఇంత మంది విద్యార్థులు ఎంపిక
చట్ట ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 25% ప్రవేశాలు ఉచితంగా కల్పించాలి. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 2023–24 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి ప్రవేశాలకు పాఠశాల విద్యాశాఖ ఎంపికలు చేపట్టింది. రెండు విడతల్లో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్న వారిలో అన్ని అర్హతలున్న 14,192 మందిని లాటరీ పద్ధతిలో ఒకటో తరగతి ప్రవేశాలకు ఎంపిక చేశారు.
చదవండి: School Education Department: ప్రైవేటు స్కూళ్లలో ఉచిత విద్యకు అవకాశం.. ఈ పద్ధతిలో విద్యార్థులను ఎంపిక
ఎంపికైన విద్యార్థులు, వారికి కేటాయించిన పాఠశాలల వివరాలను డీఈవోలు, అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్లకు అందజేసినట్లు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ పి.సురేష్ కుమార్ తెలిపారు. కేటాయించిన పాఠశాల వివరాలను ఆయా విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా పంపించామన్నారు. ఎంపికైన వారు మే 28లోగా కేటాయించిన పాఠశాలల్లో చేరాలని చెప్పారు.