School Education Department: ప్రైవేటు స్కూళ్లలో ఉచిత విద్యకు అవకాశం.. ఈ పద్ధతిలో విద్యార్థులను ఎంపిక
Sakshi Education
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పాఠశాలల్లో 2023–2024 విద్యా సంవత్సరానికి ఉచిత విద్యకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ మే 2న ఓ ప్రకటనలో సూచించారు.
ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ప్రవేశాలు ఉచితంగా కల్పించాలని నిబంధన ఉన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే మొదటి దశ ప్రవేశ ప్రక్రియలో రాష్ట్ర వ్యాప్తంగా 9,064 మంది విద్యార్థులు, వారికి కేటాయించిన పాఠశాలలను ఎంపిక చేశారు. రెండో దశ ప్రవేశాలకు మే 6 నుంచి 15వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
చదవండి: Schools: ఎల్‌కేజీకి లక్షన్నర!.. సగం ముందే కట్టాలని డిమాండ్..
గ్రామ, వార్డు సచివాలయాల డేటా ఆధారంగా విద్యార్థుల అర్హతను పరిశీలించి, మే 22న లాటరీ పద్ధతిలో విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎంపికైన వారు మే 24 నుంచి 28 వరకు ప్రవేశాలు తీసుకోవచ్చని తల్లిదండ్రులకు సూచించారు. వివరాలను http://cse.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని కమిషనర్ సురేష్‌కుమార్ తెలిపారు.
Published date : 03 May 2023 05:46PM