TS Tenth SSC Exams: పదో తరగతి విద్యార్థులకు కేంద్రాల్లోకి ఈ సమయం వరకే అనుమతి..
![DEO Soma Shekhara Sharma reveals the arrangements and rules in exam centers](/sites/default/files/images/2024/03/16/deo-soma-shekara-sharma-1710587489.jpg)
ఖమ్మంసహకారనగర్: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు జరగనుండగా... జిల్లాలో 16,577 మంది విద్యార్థుల కోసం 97 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలల్లోని 282 కేంద్రాల్లో 10,148 మంది, ప్రైవేట్ పాఠశాలల్లోని 141 కేంద్రాల్లో 6,429 మంది విద్యార్థులు హాజరవుతారు.
TS Govt Schools: సర్కారు బడుల్లో మౌలిక వసతులు, పర్యవేక్షణ బాధ్యతలు ఇకపై వీరికే!
ఉదయం 9–30 నుంచి మధ్యాహ్నం 12–30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అయితే, ఫిజిక్స్, బయాలజికల్ సైన్స్ పరీక్షలు మాత్రం ఉదయం 11గంటల వరకే ఉంటాయి. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ ఎస్సెస్సీ పరీక్షల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను ‘సాక్షి’కి వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
Tenth Class Public Exams 2024: పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం ...విద్యార్థుల ఉత్తీర్ణతకు ప్రణాళిక
9–35గంటల వరకే అనుమతి
పరీక్షలు ప్రతిరోజు 9–30గంటలకు ప్రారంభం కానుండగా 8–30గంటల నుంచి 9–35గంటల వరకు మాత్రమే అనుమతిస్తాం. ఆ తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదు. పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు జరుగుతాయి. పరీక్షలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం. అన్ని కేంద్రాల్లో ఫర్నీచర్, తాగునీరు, టాయిలెట్ల సౌకర్యం ఉంది. విద్యుత్ సౌకర్యం కూడా కల్పించి ఫ్యాన్లు ఉండేలా చర్యలు తీసుకున్నాం .
కంట్రోల్ రూమ్ ఏర్పాటు
విద్యార్థులకు ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేసేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేశాం. 24గంటల పాటు సిబ్బంది అందుబాటులో ఉంటుండగా.. 83318 51510 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు తెలపొచ్చు. అయితే, సెంటర్లు ఏర్పాటుచేసిన కొన్ని పాఠశాలల పేర్లు ఒకే తరహాలో ఉన్నందున కేంద్రాలను ముందురోజే చూసుకుంటే ఇబ్బంది ఉండదు. పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేలా 97 కేంద్రాలకు అంతే సంఖ్యలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, సిట్టింగ్ స్క్వాడ్‌తో పాటుట 1,164మంది ఇన్విజిలేటర్లను నియమించాం. వీరికి తోడు ఐదు శాతం అదనపు సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు.
Group-1 Exam జిల్లా వ్యాప్తంగా 35 కేంద్రాల్లో గ్రూప్-1 పరీక్ష
నిఘా పటిష్టం
ప్రతీ పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. జిల్లాలో ఆరు పాఠశాలల్లో ప్రహరీలు పాక్షికంగా కూలడంతో అక్కడ అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రశ్నాపత్రాలను నాలుగు చక్రాల వాహనాల్లో మాత్రమే తరలించేలా ఆదేశాలు జారీ చేశాం. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడమే కాక సమీపంలోని జిరాక్స్‌సెంటర్లను మూసివేయిస్తాం. వైద్యసిబ్బంది సైతం అందుబాటులో ఉంటారు.
Telangana Govt Jobs: ఉద్యోగాల భర్తీకి తొలగిన న్యాయ చిక్కులు
హాల్‌టికెట్లు ఇవ్వకుంటే చర్యలు
ఎస్సెస్సీ విద్యార్థులకు ఫీజులు, ఇతర కారణాలతో యాజమాన్యాలు హాల్‌టికెట్లు ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటాం. విద్యార్థులు తమ హాల్‌టికెట్లను www.bse.telangana.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక ఎవరైనా మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే చర్యలు ఉంటాయి. ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది దీన్ని ప్రోత్సహించినట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.