TS Govt Schools: సర్కారు బడుల్లో మౌలిక వసతులు, పర్యవేక్షణ బాధ్యతలు ఇకపై వీరికే!
ఈ మేరకు ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ఇదివరకు స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలు పాఠశాల నిర్వహణ బాధ్యతలు చూసిన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం వాటి కాలం ముగిసినప్పటికీ పదవి కాలం పొడిగిస్తూ వచ్చింది. తాజాగా ప్రభుత్వం ఆ కమిటీల స్థానంలో అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.
జిల్లాలో..
జిల్లాలోని 10 ప్రభుత్వ పాఠశాలల్లో జీరో ఎన్‌రోల్‌మెంట్ ఉంది. 4 పాఠశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటిని మినహాయించి 453 ప్రాథమిక, 102 ప్రాథమికోన్నత, 109 ఉన్నత పాఠశాలల్లో ఈ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఆయా పాఠశాలల్లో మొత్తం 51,332 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.
మన ఊరు– మనబడి పనులు అక్కడికక్కడే..
గత ప్రభుత్వం 2021 మార్చిలో మన ఊరు– మనబడి పేరిట కార్యక్రమాన్ని షరూ చేసింది. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టింది. జిల్లాలో మొదటి విడత 237 పాఠశాలల్లో పనులను ప్రారంభించారు. అయితే ఇప్పటివరకు కేవలం 18 పాఠశాలలను మాత్రమే పునఃప్రారంభించారు. ఇంకా 16 పాఠశాలలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నా యి. వీటి నిర్మాణం, మౌలిక వసతులు కల్పించేందు కు ప్రభుత్వం జిల్లాకు రూ.100 కోట్ల నిధులు కే టాయించగా, ఇప్పటివరకు కాంట్రాక్టర్లకు రూ.25 కోట్ల 94లక్షలు మాత్రమే విడుదల చేసింది.
గతేడాది జూలై నుంచి పనులు చేపట్టకపోవడంతో ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అయితే కొత్తగా చేపట్టే అమ్మ ఆదర్శ కమిటీలు ఈ పనులను కొనసాగిస్తా యా.. లేదా అనేది చూడాల్సిందే. కాగా, జూన్ 10 నాటికి సర్కారు బడల్లో సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఇందుకు సంబంధించి అవసరమైన నిధులు కేటాయించాలని ఉన్నతాధికారులకు సూచించింది.
చదవండి: Schools Inspection: ఉపాధ్యాయులకు వణుకు పుటిస్తున్న ఎమ్మెల్యే!
పాఠశాలల వివరాలు..
- జిల్లాలో మొత్తం పాఠశాలలు: 678
ఆదర్శ కమిటీలు
- ఏర్పాటు చేయనున్నవి: 664
- జిల్లాలో ఎస్‌హెచ్‌జీ గ్రూపులు: 10వేలు
- మొత్తం సభ్యులు: 1.05లక్షలు
- ఎస్‌ఎంసీల స్థానంలో ఏర్పాటు
- ‘ఎస్‌హెచ్‌జీ’ సభ్యులతో కొత్త కమిటీలు
- వీటికే పాఠశాల నిర్వహణ బాధ్యతలు
- జూన్ 10నాటికి మౌలిక వసతుల కల్పనే లక్ష్యం
కమిటీల బాధ్యతలు..
ఈ కమిటీలు సర్కారు బడుల్లో మౌలిక వసతుల బలోపేతానికి కృషి చేయనున్నాయి. బాలికల మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సౌకర్యం, తరగతి గదుల్లో విద్యుత్ సౌకర్యం కల్పించడం, ఇతర మరమ్మతు పనులు, సో లార్ ప్యానెల్ ఏర్పాటుతో పా టు విద్యార్థుల కు అందజేసే యూనిఫాం కుట్టించే బాధ్యత ను స్వయం సహాయక సంఘాలు తీసుకుంటాయి.
అమ్మ ఆదర్శ కమిటీలో పాఠశాల స్థాయిలో ఎస్‌హెచ్‌జీ అధ్యక్షురాలు చైర్‌పర్స న్, మిగతావారు సభ్యులుగా ఉంటారు. ప్రధానోపాధ్యాయులు కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఇకపై ప్రభుత్వ బడి నిర్వహణ బాధ్యతలు స్వయం సహాయక సంఘాలే చూస్తాయి.
పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీలు..
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేస్తాం. స్వయం సహాయక సభ్యుల ద్వారా బడి నిర్వహణ చేపట్టేలా చూస్తాం. ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకుంటాం. కొత్త కమిటీలో స్వయం సహాయక సంఘాల గ్రామ కమిటీ అధ్యక్షురాలు చైర్‌పర్సన్‌గా, విద్యార్థుల తల్లిదండ్రులు సభ్యులుగా, ప్రధానోపాధ్యాయులు కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
– ప్రణీత, డీఈవో