Education: విద్యార్థులు ఇష్టంతో చదవాలి
Sakshi Education
మానకొండూర్: మంచి మార్కులతో భవిష్యత్‌కు అడుగువేయాలని డీఐఈవో జగన్‌మోహన్‌రెడ్డి వి ద్యార్థులను కోరారు.
మండల కేంద్రంలోని ప్రభు త్వ జూనియర్ కళాశాలను ఆగస్టు 17న సందర్శించా రు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు ఇష్టపడి చదివితే గుర్తుంటుంద ని, అధ్యాపకులు బోధించిన పాఠాలు శ్రద్ధగా వినా లని, అనంతరం పునశ్చరణ చేసుకోవాలని సూచించారు.
చదవండి: ZP High School: అటు చదువులోను.. ఇటు క్రీడల్లోనూ నంబర్ వన్
పరీక్షలలో మంచి మార్కులు సాధించేలా, వి ద్యార్థుల హాజరు శాతం పెంచాలన్నారు. జీకే, పోటీ పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో కళా శాల కళాశాల ప్రిన్సిపాల్ వి.ఆంజనేయరావు, అధ్యాపకులు శరత్, కరుణ, నజీమ, రమేశ్, శ్రీనివా స్, లలిత, మంజుల, సురేశ్, శ్రీనివాస్‌రెడ్డి, నిరోషా తదితరులు పాల్గొన్నారు.
Published date : 18 Aug 2023 03:38PM