Andhra Pradesh: విద్య, వైద్యం సీఎం మానస పుత్రికలు
పలమనేరు పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఆగస్టు 13న చిత్తూరు జిల్లా వైఎస్సార్ టీచర్స్‌ఫెడరేషన్ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉపాధ్యాయ సమస్యలపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా స్పందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్సార్‌టీఎఫ్ కార్యవర్గాలను ఎంపిక చేసి బలమైన ఉపాధ్యాయ సంఘంగా తీర్చిదిద్దుతామన్నారు.
చదవండి: జయ శారదా ని‘కేతనం’.. మహాత్మాగాంధీ అడుగుపెట్టిన స్థలం
జిల్లా నూతన కార్యవర్గ ఎంపిక
ఈ సందర్భంగా సంఘ జిల్లా నూ తన కార్యవర్గ ఎంపిక జరిగింది. జి ల్లా సలహాదారు గా సోమచంద్రారె డ్డి, గౌరవాధ్యక్షుడిగా నాగరాజు, అధ్యక్షుడిగా యువరాజరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జయకాంత్, కోశాధికారిగా ఏఆర్ కుమార్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ధనుంజయ రెడ్డి, ఉపాధ్యక్షులుగా విశ్వనాథ్ రెడ్డి, ఇలియాజ్, శోభారాణి, రవీంద్రనాథ్, రాష్ట్ర కౌన్సిలర్లుగా రెడ్డి శేఖర్‌రెడ్డి, గోవిందస్వామితో పాటు మరో పదిమంది కార్యనిర్వాహక సభ్యులను ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, 98 డీఎస్సీ నాయకులు పాల్గొన్నారు.
చదవండి: NCC Training Academy: ఎన్‌సీసీ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలి