Skip to main content

Department of Education: ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణపై మంత్రివర్గ ఉప సంఘం భేటీ

ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ దిశగా ప్రభుత్వం శరవేగంగా అడుగులేస్తోంది.
Department of Education
ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణపై మంత్రివర్గ ఉప సంఘం భేటీ

2022 విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమల్లోకి తేవాలని నిర్ణయించింది. ఈ మేరకు పిబ్రవరి 21న రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం భేటీ కాబోతోంది. హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల విభాగంలో తెలంగాణ‌ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి మొత్తం 14 మంది మంత్రులు, విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. సబ్‌ కమిటీ ఏర్పాటైన తర్వాత భేటీ అవడం ఇదే తొలిసారి. ఇందులో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం అమలుపైనా చర్చించనున్నట్టు సమాచారం. ఫీజుల నియంత్రణకు సంబంధించి గతంలో ప్రభుత్వం ఆచార్య తిరుపతిరావు కమిటీని వేయగా.. 2017లోనే కొన్ని సిఫార్సులు చేసింది. వాటిలో చాలా వరకు ఆమోదించే అవకాశం ఉన్నట్టు తెలిసింది.

ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి..

ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను పరిగణనలోనికి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో 35లక్షల మందికిపైగా విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్నారు. ఆయా పాఠశాలను బట్టి రూ.12 వేల నుంచి రూ.4 లక్షల వరకు వార్షిక ఫీజులు వసూలు చేస్తున్నారు. అయితే ఫీజులు అడ్డగోలుగా ఉంటున్నాయని, కొన్ని స్కూళ్లు ఏటా 25 శాతం దాకా పెంచుతున్నాయని కొన్నేళ్లుగా తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం ఫీజుల నియంత్రణకు జీవోలు విడుదల చేసినా.. అవి న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. మరోవైపు ప్రైవేటు ఫీజుల దందాను నియంత్రించేందుకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్తాన్, గుజరాత్, పశి్చమబెంగాల్, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌ సహా 15 రాష్ట్రాలు ప్రత్యేక చట్టాలు చేసుకున్నాయి. అదే తరహాలో రాష్ట్రంలోనూ పటిష్టమైన చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రైవేటు స్కూళ్ల అభిప్రాయమూ తీసుకోండి: మంత్రికి వినతి

ఫీజుల నియంత్రణ చట్టానికి సంబంధించి తమ అభిప్రాయాలనూ తీసుకోవాలని, రూపకల్పనలో భాగస్వామ్యం కలి్పంచాలని ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు కోరుతున్నాయి. ఈ మేరకు ‘గుర్తింపు పొందిన ప్రైవేటు స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్ (ట్రస్మా)’ రాష్ట్ర అధ్యక్షుడు వై.శేఖర్‌రావు ఫిబ్రవరి 20న మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఫీజుల నియంత్రణ చట్టాన్ని తాము సమరి్థస్తున్నామని.. అయితే అన్ని స్కూళ్లనూ ఒకేగాటన కట్టడం సరికాదని విజ్ఞప్తి చేశారు. కొన్ని స్కూళ్లు నష్టాల్లోనూ విద్యాబోధన చేస్తున్నాయని, వాటికి వెసులుబాటు కలి్పంచాలని కోరారు.

చదవండి: 

Govt Schools: రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలకు అంతర్జాతీయ గుర్తింపు

స్కూల్స్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సులుగా హైస్కూళ్లు

రాష్ట్రంలోని స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం

Published date : 21 Feb 2022 04:03PM

Photo Stories