Skip to main content

Transfers of Teachers: టీచర్ల సర్దుబాటుకు అనుమతి

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ చేపట్టాలని అన్ని జిల్లా కలెక్టర్లు, డీఈవోలకు పాఠశాల విద్య డైరెక్టరేట్‌ సెప్టెంబ‌ర్ 20న‌ ఉత్తర్వులు జారీ చేసింది.
Education authorities addressing school administration changes in Hyderabad  Adjustment of teachers allowed  District Collectors and DEOs receiving instructions on school mergers

ఇదే క్రమంలో ఒకే గ్రామ పంచాయతీ పరిధిలో ఉండే రెండు స్కూళ్లను విలీనం చేసే అధికారాన్ని జిల్లా యంత్రాంగానికి అప్పగించారు.

పాఠశాల విద్య డైరెక్టర్‌ ఇ.నర్సింహారెడ్డి సెప్టెంబ‌ర్ 20న‌ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. తాజా యూడైస్‌ డేటాను పరిగణనలోనికి తీసుకుని ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టాలని సూచించారు.

చదవండి: Telangana Schools News: తెలంగాణ బడుల్లో... ఇక డిజిటల్‌ విద్య

ప్రైమరీ... యూపీఎస్ స్కూళ్లలో

విద్యార్థుల

ఉండాల్సిన టీచర్లు

1-10

1

11-60

2

61-90

3

91-120

4

121-105

5

153-200

6

అప్పర్ ప్రైమరీ ఆ పైన

1-20

సబ్జెక్టు టీచర్లు - 2 (1 లాంగ్వేజ్, 1 సబ్జెక్టు)

21 ఆపైన

సబ్జెక్టు టీచర్లు - 4

▶ Join our WhatsApp Channel: Click Here
▶ Join our Telegram Channel: Click Here
▶ Follow our YouTube Channel: Click Here
▶ Follow our Instagram Page: Click Here

చాలా స్కూళ్లలో విద్యార్థులున్నా, టీచర్లు ఉండటం లేదని, టీచర్లు ఎక్కువగా ఉన్నచోట విద్యార్థులు ఉండటం లేదని గుర్తించారు.

టీచర్లు లేని స్కూళ్లలో విద్యార్థులు చేరినా, తిరిగి వారు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లిపోతున్నారని చెప్పారు. దీన్ని నివారించేందుకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఒకే కాంప్లెక్స్‌లో రెండు స్కూళ్లు ఉంటే, వాటిని విలీనం చేసేందుకు విద్యాశాఖ అనుమతించింది. ఎంతమంది విద్యార్థులకు ఎంతమంది టీచర్లు ఉండాలో విద్యాశాఖ సూచించింది.

Published date : 21 Sep 2024 12:29PM

Photo Stories