Skip to main content

Govt Schools: రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలకు అంతర్జాతీయ గుర్తింపు

Recognition of States Government schools
Recognition of States Government schools
  • ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఏఐ’ 
  • వినియోగంపై టీసీఎస్‌కు అవార్డు 

సాక్షి, అమరావతి: పాఠశాలల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 45,000కు పైగా పాఠశాలల్లో తరగతి గదులు, మూత్ర, భోజనశాలల పరిశుభ్రతను నేరుగా పర్యవేక్షించేలా పాఠశాల విద్యాశాఖ వినియోగిస్తోన్న  ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) టెక్నాలజీ వినియోగానికి అవార్డు లభించింది. సీఎం వైఎస్‌ జగన్‌ సూచనల మేరకు పాఠశాలల పరిశుభ్రతకు దేశంలో తొలిసారిగా ఏఐ టెక్నాలజీని రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తోంది. ఈ బాధ్యతను టాటా కన్సల్టెన్సీ సరీ్వసెస్‌(టీసీఎస్‌)కు అప్పగించింది. ట్రినిటీ సంస్థ నిర్వహించిన ఏఐ అవార్డ్స్‌–2022లో స్టెయినబిలిటీ విభాగంలో  టీసీఎస్‌కు ఈ అవార్డు వచి్చంది. విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించేలా  టీసీఎస్‌ మొబైల్‌ యాప్‌ను రూపొందించింది. మూత్రశాలలు, తరగతి గదులు, వంట శాలలను మొబైల్‌ యాప్‌లో ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేస్తే వాటి పరిస్థితులను విశ్లేíÙంచి, తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు సమాచారం, సూచనలను ఇవ్వడం ఈ యాప్‌ ప్రత్యేకత.
 

ఎడ్యుకేషన్‌ న్యూస్‌ఎడ్యుకేషన్‌ న్యూస్‌

Published date : 18 Feb 2022 03:09PM

Photo Stories