Education and Health: విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
Sakshi Education
గద్వాల రూరల్/ఎర్రవల్లి: విద్యార్థుల చదువు, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు.
సెప్టెంబర్ 26న గద్వాల మండలం వీరాపురం సమీపంలోని గిరిజన సంక్షేమ బాలికల జూనియర్ కళాశాల, పాఠశాలను, ఎర్రవల్లి కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని అదనపు కలెక్టర్ సందర్శించారు.
చదవండి: Teachers Adjustment: టీచర్ల హేతుబద్ధీకరణ ఉత్తర్వులు సవరించాలి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో నాణ్యమైన విద్య ఎంతో ముఖ్యమని, విద్యాప్రమాణాలు మెరుగుపర్చేలా ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలన్నారు. చదువుతో పాటు విద్యార్థులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
భోజన నాణ్యత విషయంలో రాజీపడొద్దని సూచించారు. పాఠశాల పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ప్రిన్సిపల్ శ్రీరేఖ, ఎస్‌ఓ ఆసియాబేగం, ఉపాధ్యాయులు శివప్రసాద్, యశోద తదితరులు పాల్గొన్నారు.
Published date : 01 Oct 2024 10:45AM