Skip to main content

A Book of Poems Written by Students: బాలమేధావుల ‘దేవగన్నేరు’

వెల్దండ: మండలంలోని అజిలాపూర్‌ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో విద్యార్థులు రచించిన దేవగన్నేరు పుస్తకాన్ని సెప్టెంబ‌ర్ 26న‌ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆవిష్కరించారు.
Release Devaganneru Poems Book

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఎంతో మేధాశక్తి కలిగి ఉన్నారన్నారు. ఇక్కడ బోధించే ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందన్నారు. ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చదువులో రాణిస్తున్నారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. విద్యార్థులు రచించిన కవితలు చూసిన ప్రతిఒక్కరు అభినందించారు.

చదవండి: PM Shri Scheme : పాఠ‌శాల‌ల అభివృద్ది ప‌నులు వేగ‌వంతం.. క‌లెక్ట‌ర్ ఆదేశం!

కార్యక్రమంలో ప్రొఫెసర్‌ యాకుబ్‌, ఇన్‌చార్జ్‌ ఎంఈఓ చంద్రుడు, నోడల్‌ అధికారి రవీందర్‌, హెచ్‌ఎం డేవిడ్‌రాజ్‌, నాయకులు భూపతిరెడ్డి, సంజీవ్‌కుమార్‌, వెంకటయ్యగౌడ్‌, మోతీలాల్‌నాయక్‌, లక్ష్మమ్మ, కాలే లక్ష్మమ్మ, సులోచన, లక్ష్మయ్య, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
  • తమలోని ప్రతిభను కవితల రూపంలో ఆవిష్కరించిన చిన్నారులు
  • ప్రోత్సహించి.. పుస్తకంగా మలచిన ఉపాధ్యాయులు
  • ఆలోచింపజేస్తున్న అజిలాపూర్‌ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థుల కవితా సంపుటి
     

‘కొందరు నా సంపద.. నా ఇల్లు అంటారు..

మరికొందరు నా సంపద.. నా పొలం అంటారు..

కానీ, నా సంపద మాత్రం నా చదువే..’

‘గాంధీతాత లేకుంటే స్వేచ్ఛలేదు..

అక్షరాలు లేకుంటే పదాలు లేవు..

చదువు లేకుంటే నాకు బతుకే లేదు..’
 

కవితలు నేర్పిస్తున్నారు..

పాఠశాలల్లో ఉపాధ్యాయులు చదువుతోపాటు కవితలు నేర్పిస్తున్నారు. వారి ప్రోత్సాహంతోనే అనేక కవితలు రచిస్తున్నాం. పాఠశాలల్లో తోటి విద్యార్థులతో పోటీపడి కవితలు రాస్తున్నాం. చదువుతోపాటు వివిధ రంగాల్లో రాణిస్తున్న విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందిస్తున్నారు.

– అక్షిత, 5వ తరగతి, వెల్దండ

పోటాపోటీగా..

పాఠశాలల్లో తోటి విద్యార్థులతో పోటాపోటీగా కవితలు నేర్చుకుంటున్నాం. ఉపాధ్యాయులు ఉదాహరణకు ఒక కవితను ఇస్తారు. మరుసటి రోజు అదే పద్ధతిలో మరో కవిత తయారు చేసుకొస్తాం. పాఠశాలలో చదువుతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నేర్పిస్తారు. ఇలాంటి ఉపాధ్యాయులు మాకు గురువులుగా రావడం మా అదృష్టం.

– శివదీక్షిత్‌, 7వ తరగతి, అజిలాపూర్‌

Published date : 28 Sep 2024 09:42AM

Photo Stories