డిజైన్ అండ్ టెక్నాలజీలో ఈ కోర్సు
Sakshi Education
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని సిరిసిల్ల మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో డిజైన్ అండ్ టెక్నాలజీతో కూడిన బీఎస్సీ ఆనర్స్ కోర్సును ప్రవేశపెట్టినట్లు సొసైటీ కార్యదర్శి రోనాల్డ్‌రాస్ ఆగస్టు 3న ఒక ప్రకటనలో తెలిపారు.
ఫ్యాషన్, గార్మెంట్ పరిశ్రమలో ఉద్యోగాలు పొందాలనుకున్న విద్యార్థినులకు ఈ కోర్సు ఎంతో ఉపయోగకరమని ఆయన స్పష్టం చేశారు. ఈ కోర్సులో ప్రవేశాలకు సంబంధించిన సమాచారాన్ని సొసైటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు.
చదవండి:
Published date : 04 Aug 2022 01:08PM