Jobs: అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
మొయినాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పశ్చిమ ప్రాంతంలోని 17 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో తాత్కాలిక పద్ధతిలో అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రాంతీయ సమన్వయాధికారి శారద జూన్ 29న ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
తెలుగు, హిందీ, ఇంగ్లిష్, గణితం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, జంతు శాస్త్రం, వృక్ష శాస్త్రం, అర్థ శాస్త్రం, పౌరశాస్త్రం బోధించేందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అదే విధంగా లైబ్రేరియన్, పీఈటీ, హెల్త్ సూపర్‌వైజర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు జూలై 3న ఉదయం 9 గంటలకు మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గురుకులంలో జరిగే డెమోకు సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.
అభ్యర్థులు పీజీ, బీఈడీ, జీఎన్‌ఎం, బీపీఈడీ, బీఎల్‌ఐసీ అర్హతలు కలిగి ఉండాలన్నారు. ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు.
చదవండి:
Published date : 01 Jul 2024 06:03PM