Supreme Court: ఓఎంఆర్ షీట్ల ఫిర్యాదులపై కాలపరిమితి ఉందా
Sakshi Education
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ యూజీ ఓఎంఆర్ షీట్లకు సంబంధించి విద్యార్థుల ఫిర్యాదుల పరిష్కారానికి కాలపరిమితి ఉందా అని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ని సుప్రీకోర్టు జూన్ 27న ప్రశ్నించింది.
అన్ని ఓఎంఆర్ షీట్లు అప్‌లోడ్ చేసి అందుబాటులో ఉంచామని ఎన్‌టీఏ తరఫు న్యాయవాది వివరించారు. కాలపరిమితి వివరాలతో కౌంటరు వేయాలని ఎన్‌టీఏను కోర్టు ఆదేశించింది.
చదవండి: MBBS Fees: ఇక MBBS ఫీజు ఇన్ని సంవత్సరాలకే తీసుకోవాలి
‘నీట్–యూజీ’ కేసులో ఇద్దరి అరెస్ట్
నీట్–యూజీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సీబీఐ బృందం పట్నాలో ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. వీరు ప్రశ్నాపత్రంతోపాటు జవాబుల కీను కూడా అభ్యర్థులకు సరఫరా చేసినట్లు అధికారులు అంటున్నారు.
Published date : 28 Jun 2024 03:34PM