Skip to main content

6th Class Admissions in TSWREIS: తెలంగాణ సాంఘిక సంక్షేమ సైనిక పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాలు.. పరీక్ష తేదీ ఇదే..

తెలంగాణ సోషల్‌ వేల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాల(బాలురు), రుక్మాపూర్, కరీంనగర్‌ జిల్లాలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాలకు అర్హులైన బాలుర నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Admissions Notice for Class VI  6th Class Admissions in TSWREIS   Telangana Social Welfare Gurukula Sanika School

మొత్తం సీట్ల సంఖ్య: 80
అర్హత: 2023-24 విద్యా సంవత్సరంలో ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల నుంచి ఐదో తరగతిలో పరీక్షకు హాజరైన/ఉత్తీర్ణులైన బాలురు మాత్రమే అర్హులు. విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2,00,000(పట్టణ ప్రాంతం), రూ.1,50,000 (గ్రామీణ ప్రాంతం) మించకూడదు. తెలుగు/ఇంగ్లిష్‌ మీడియం విద్యార్థులు అర్హులు. విద్యార్థులు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు: 01.04.2004 నాటికి 11 ఏళ్లు మించకూడదు. 01.04.2013 నుంచి 31.03.2015 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: మూడంచెల్లో ఉంటుంది. స్టేజ్‌-1(స్టేట్‌ లెవల్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌-100 మార్కులు), స్జేజ్‌-2(స్క్రీనింగ్‌ టెస్ట్‌లు-150 మార్కులు). ఇందులో ఫిజికల్, సైనిక్‌ స్కూల్‌ ఆప్టిట్యూడ్‌(రాత-డిస్క్రిప్టివ్‌), కమ్యూనికేషన్‌ స్కిల్‌ టెస్ట్‌లు ఉంటాయి. వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.

చదవండి: TSRJC CET 2024 Notification: గురుకులాల్లో.. ఉచితంగా ఇంటర్‌

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 01.03.2024.
హాల్‌టిక్కెట్‌ డౌన్‌లోడ్‌ తేది: 06.03.2024.
ప్రవేశ పరీక్ష తేది: 10.03.2024.
ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ తేదీలు: 22.03.2024, 23.03.2024, 26.03.2024, 27.03.2024, 28.03.2024.

వెబ్‌సైట్‌: https://tswrsplschools.cgg.gov.in/

Published date : 29 Feb 2024 05:53PM

Photo Stories