మంజూరు చేసిన చోటే గురుకులాలు
Sakshi Education
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన గురుకుల విద్యాసంస్థలను మంజూరు చేసిన ప్రాంతాల్లోనే నిర్వహించాలని, ఇతరచోట్ల వాటిని నిర్వహించడం సరికాదని తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు.
ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో దాదాపు 43 గురుకుల పాఠశాలలు ఇతర ప్రాంతాల్లో కొనసాగుతున్నాయని, వాటిని వెంటనే మంజూరు చేసిన చోటే నిర్వహించాలని మంత్రి కొప్పుల ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్‌రాస్‌ను ఆదేశించారు. ఎస్సీ గురుకుల సొసైటీ కార్యక్రమాలపై జూలై 27న మంత్రి క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులు, ప్రిన్స్‌పల్స్‌తో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో అవసరమైన ఏఎన్‌ఎంలు, నాన్–టీచింగ్ సిబ్బంది నియామకాల గురించి కలెక్టర్ల అనుమతి తీసుకోవాలన్నారు.
చదవండి:
Published date : 28 Jul 2022 01:32PM