విద్యార్ధులకు టీవీ ద్వారాటీ- సాట్ పాఠాలు: టీఎస్ గురుకుల సొసైటీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్ ప్రకటించడం.. ఆ తర్వాత వేసవి సెలవులుండటంతో గురుకుల సొసైటీలు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి.
లాక్‌డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసేలా గురుకుల విద్యాసంస్ధల సొసైటీలు టీవీ ద్వారా బోధన, అభ్యసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ నెల 24 నుంచి మే 30 వరకు టీ-సాట్ చానల్ ద్వారా వివిధ అంశాల్లో విద్యార్ధులకు తరగతులు నిర్వహించనున్నాయి.
ఆరు నుంచి పదో తరగతి వరకు...
టీ-సాట్ ద్వారా నిర్వహించే కార్యక్రమాలను ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్ధులు వీక్షించవచ్చు. ఇందులో సబ్జెక్టు పాఠాలతో పాటు విద్యార్ధులు అభిరుచికి తగిన అంశాలను బోధిస్తారు. ఇందుకు గురుకుల సొసైటీలు ప్రత్యేకంగా బోధకులను ఎంపిక చేశారు. ఈ నెల 24 నుంచి రికార్డెడ్, లైవ్ పాఠాలను అందించనున్నారు. పాఠ్యాంశ బోధనలతో పాటు పిల్లలకు ఆసక్తి ఉన్న అంశాలపైనా బోధన కార్యక్రమాలుంటాయి. ఆసక్తి ఉన్న వారెవరైనా వీటిని చూడొచ్చని ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యా సంస్థలు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశాయి.

Published date : 15 Apr 2020 06:22PM