విద్యుత్ ఇంజనీర్లకు పదోన్నతి కల్పించాలి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: పదోన్నతులు లేక ఏడేళ్లుగా నిరీక్షిస్తున్న విద్యుత్ ఇంజనీర్లకు తక్షణమే పదోన్నతులు కల్పించాలని తెలంగాణ విద్యుత్ ఇంజనీర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.
ఇంజనీర్ల బదిలీలపై సత్వరం విధి విధానాలను ప్రకటించాలని కోరింది. అసోసి యేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.నెహ్రూ, ఎన్.భాస్కర్ జూలై 24న విద్యుత్ సౌధలో ట్రాన్స్‌కో, జెన్‌కో ఇన్‌చార్జి సీఎండీ రోనాల్డ్ రాస్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమ ర్పించారు.
చదవండి: Btech EEE Branch Advantages : ఇంజనీరింగ్‌లో 'EEE' బ్రాంచ్ తీసుకోవడం ద్వారా.. లాభాలు ఇవే..!
1999–2004 మధ్యకాలంలో నియమితులైన ఉద్యోగులకు జీపీఎఫ్ పెన్షన్ సదుపాయాన్ని కల్పించాలని కోరారు. రామ గుండం బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం స్థానంలో.. కొత్త విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని జెన్‌కో ఆధ్వర్యంలోనే చేపట్టాలని సూచించారు.
Published date : 25 Jul 2024 11:33AM